Asianet News TeluguAsianet News Telugu

ఒంటరిగా ఉన్నానని విద్యార్థినిని పిలిచిన పక్కింటి మహిళ... అర్థరాత్రి స్కూల్ వ్యాన్ డ్రైవర్ తో అత్యాచారం...

రోజూ తన వ్యాన్ లో స్కూలుకు వచ్చే విద్యార్థినిపై కన్నేశాడో డ్రైవర్. ఆమె పక్కింటి మహిళ సహాయంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వీడియోను తీసి వైరల్ చేశాడు. 

School van driver raped girl student, video went viral in uttarpradesh - bsb
Author
First Published Jul 20, 2023, 8:46 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు అదే వ్యాన్ లో ఆ స్కూలు విద్యార్థిని (14)  వెడుతుంది. ఆ బాలికపై కన్నేసిన వ్యాన్ డ్రైవర్ పథకం ప్రకారం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాన్పూర్ దేహాత్ జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

బాధిత బాలిక ఇంటి పక్కన ఉండే కుటుంబం ఊరికి వెళ్ళింది. ఆ ఇంట్లో ఓ మహిళ ఒంటరిగా ఉంది. పరిచయస్తులు కావడంతో తనకు తోడుగా పడుకోమని ఆ మహిళ బాలికను పిలిచింది. దీనికి బాలిక తల్లిదండ్రులను అడగగా.. వారు కూడా సరే అన్నారు. అలా బాలిక ఆ పక్కింటి మహిళ దగ్గర ఆ రాత్రి పడుకుంది.. అయితే, ఆ మహిళ పథకం ప్రకారమే ఇదంతా చేసిందని ఆ తర్వాతే అర్థమైంది.

చిత్రకూట్ జలపాతం వద్ద యువతి ఆత్మహత్యాయత్నం.. 90 అడుగుల ఎత్తునుంచి దూకి..

అర్ధరాత్రి పూట ఆ మహిళ వ్యాన్ డ్రైవర్ నౌషాద్ కు ఫోన్ చేసింది.  ఇంటికి రమ్మని పిలిచింది. ఆమె సమాచారంతో ఇంటికి వచ్చిన వ్యాన్ డ్రైవర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మహిళ ఇదంతా వీడియో తీసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసింది. భయపడ్డ బాధితురాలైన విద్యార్థిని.. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.

వీడియో వైరల్ కావడంతో వ్యవహారం ఇంట్లో తెలిసింది. దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీశారు. దీంతో భయపడిన బాలిక  జరిగిన విషయం అంతా తల్లిదండ్రులతో చెప్పింది. వెంటనే బాలికను తీసుకొని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. నౌషాద్ మీద, పక్కింటి మహిళ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడైన నౌషాద్ ను అరెస్టు చేశారు. అతని మీద అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios