తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎట్టయ్యపురం సమీపంలోని కీజనంబిపురంలోని ఎయిడెడ్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. నిందితుల్లో విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తాత ఉన్నాడు. వివరాలు..కీజనంబిపురంలోని ఎయిడెడ్ పాఠశాలలో 2వ తరగతి విద్యార్థి ఒకరు తనను ఉపాధ్యాయుడు ఆర్ భరత్ కొట్టాడని వెళ్లి తన తాత మునిసామికి చెప్పాడు. 

దీంతో విద్యార్థి తాతా మునిసామమి, తల్లిదండ్రులు శివలింగం, సెల్వి లు పాఠశాలకు చేరుకున్నారు. తమ పిల్లవాడిని కొట్టడంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమస్యపై ఆర్ భరత్, ప్రధానోపాధ్యాయురాలు గురువమ్మాళ్.. వారితో చర్చించేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకుండా పోయింది. శివలింగం ఒక్కసారిగా ఉపాధ్యాయుడు భరత్‌ను కొట్టడం ప్రారంభించాడు. సెల్వి, మునిసామి కూడా అతనికి జత కలిసి భరత్‌పై దాడి చేశారు. భరత్ అక్కడి నుంచి పరుగులు తీసినా వెంబడించి మరి కొట్టారు. పాఠశాలలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు దాడిని అడ్డుకున్నారు. 

Scroll to load tweet…

ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు.. పాఠశాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుడు భరత్‌పై దాడి చేసిన శివలింగం, సెల్వి, మునిసామిలను అరెస్ట్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రులపై దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక, ఈ ఘటనపై విద్యార్థి తల్లి సెల్వి మాట్లాడుతూ.. ‘‘పిల్లలను కొట్టడం చట్టవిరుద్ధం. వారికి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? నేను వారిపై దాడి చేస్తాను’’ అని పేర్కొన్నారు. అయితే విద్యార్థిని కొట్టాననే ఆరోపణలను ఉపాధ్యాయుడు భరత్ ఖండించారు. తాను విద్యార్థిపై దాడి చేయలేదని చెప్పారు. అయితే బాలుడు తరగతిలో శ్రద్ధ చూపడం లేదని.. ఇతర పిల్లలను కొట్టడం వల్లనే ఉపాధ్యాయుడు భరత్ మందలించాడని పాఠశాల వర్గాలు చెబుతున్నాయి.