హిమాచాల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా ధర్మశాలలో చేపట్టే ర్యాలికి విద్యార్థులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలు చూశారు. ప్రస్తుతం ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషయంగా ఉన్నట్లు, మిగతావారి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. 

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ లో సందర్శించనున్న నేపథ్యంలో ధర్మశాలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ కోసమే విద్యార్ధులను ధర్మశాలకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.  

ఈ బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను ఆదేశించింది.