భవిష్యత్తు గురించి చాలా మంది చాలానే చెబుతుంటారు. దాంట్లో కొన్ని వాళ్లు చెప్పినట్లే జరుగుతాయి. కొన్ని మాత్రం బెడసి కొడతాయి. అయితే.. కొందరు చెప్పే విషయాలు చాలా మంది నమ్మరు. అవి నిజ జీవితంలో జరిగితే తప్ప వాళ్లు నమ్మరు.  కాగా..తాజాగా ఈ 2020 ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఓ బాలుడు పదేళ్ల క్రితమే చెప్పడం గమనార్హం. కాగా.. దానికి సంబంధించిన విషయం ఇప్పుడు వైరల్ గా మారడం గమనార్హం.

పదేళ్ల క్రితం ఓ పదేళ్ల కుర్రాడు ఈ ప్రిడిక్షన్ చేశాడు. ఆ బాలుడి పేరు కెవిన్ సింగ్. తన ఇయర్ బుక్‌లో కెవిన్ రాసుకున్న కొన్ని ఊహలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పుస్తకంలో 2020 గురించి కూడా కెవిన్ రాశాడు. ‘‘ఆ సంవత్సరం మనుషులంతా ఎటువంటి ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా బతుకుతారు. ఎటువంటి వ్యాధులనైనా దీటుగా ఎదుర్కొంటారు’’ అని కెవిన్ రాసుకున్నాడు.

ఇది కొంచెం రఫ్‌గా ఈ ఏడాది గడిచిన కాలాన్ని సూచిస్తోంది. 2020లో ఘర్షణలు ఎక్కువగా పడలేదు. క్వారంటైన్‌, లాక్‌డౌన్ కారణంగా దేశాలన్నీ చాలా ప్రశాంతంగా గడిపేశాయి. అలాగే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించడంతో దాన్ని నియంత్రించే కొత్త వ్యాక్సిన్లు తయారు చేశారు. ఇదంతా చూసిన నెటిజన్లు.. కెవిన్ అప్పట్లో అలా అనడం వల్లే ఈ సంవత్సరంలో ఇలా జరిగిందంటూ సరదాగా ఆరోపణలు చేశారు.

 కొందరైతే మాకు ఏదో మంచి జరుగుతుందని జ్యోతిష్యం చెప్పాలంటూ అడుగుతున్నారు.  అప్పట్లో కెవిన్ ఇయర్ బుక్‌లో రాసుకున్న ఈ ప్రిడిక్షన్ ఫొటోను ఇప్పటి వరకూ 70వేల మంది ట్విట్టర్ యూజర్లు లైక్ చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ విషయం కెవిన్‌కు తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన కెవిన్.. అప్పట్లో అలా భవిష్యత్తు చెప్పినందుకు సారీ అంటూ జోక్ చేశాడు.