ప్రపంచ వ్యాప్తంగా నేడు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మహిళలు చేస్తున్న కృషిని, సాధిస్తున్న ఘనతను గుర్తించి.. వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా... ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లు కూడా దేశ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మహిళలు అనేక రంగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహిళలు, పురుషుల మధ్య అసమానతలు తొలగేందుకు మనం అందరం కలిసి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

 

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ప్రత్యేక ట్వీట్ చేశారు. దేశంలో మహిళలు సాధిస్తున్న విజయాలు చూసి... ఎల్లప్పుడూ గర్వ పడుతున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించేలా... ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.