Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి షాక్.. యూపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన పార్టీ అధిష్ఠానం

Priyanka Gandhi: భారత జాతీయ కాంగ్రెస్ (Congress Party) పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ తరుణంలో అగ్ర నాయకురాలు, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి  ప్రియాంక గాంధీకి ఏఐసీసీ షాకిచ్చింది. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ పదవి నుంచి ప్రియాంక గాంధీ వాద్రాను తప్పించారు. 

Sachin Pilot appointed Chhattisgarh In-charge, Priyanka Gandhi removed as UP Chief KRJ

Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో భారీగా వ్యవస్థాగత మార్పులు జరిగాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కీలక మార్పులు చేశారు. ఈ తరుణంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా షాక్ తగిలింది. ఆమె ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం ప్రియాంక గాంధీని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఆమె స్థానంలో అవినాశ్ పాండేని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి ఏ రాష్ట్ర బాధ్యతలను అప్పగించలేదు. అవినాశ్ పాండే మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు.2010లో ఆయన ఎంపీగా గెలుపొందారు.  

ఇక..మోహన్ ప్రకాష్‌ను బీహార్‌కు, సుఖ్‌జిందర్ సింగ్ రంధవా రాజస్థాన్‌కు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతారు. రాజస్థాన్‌కు చెందిన పలువురు నేతలకు సంస్థలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు. ఇందులోభాగంగా సచిన్ పైలట్ కు బాధ్యతలు స్వీకరించారు.ఛత్తీస్‌గఢ్‌కు సచిన్‌ పైలట్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీంతో పాటు రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌ను ఛత్తీస్‌గఢ్ ఇంచార్జ్‌గా నియమించారు. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఛత్తీస్‌గఢ్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. కుమారి శైలజా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టగా, శైలజాను  ఇప్పుడు ఉత్తరాఖండ్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. 

సంస్థాగత మార్పుల దృష్ట్యా పంజాబ్‌కు దేవేంద్ర యాదవ్‌ను, ఆంధ్రప్రదేశ్‌కు మాణికం ఠాగూర్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. అదే విధంగా దీపా దాస్‌మున్షీకి కేరళతో పాటు తెలంగాణ బాధ్యతలు అప్పగించగా, రమేష్ చెన్నితాలను మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్‌గా నియమించారు. కాంగ్రెస్ నాయకుడు జిఎ మీర్‌ను జార్ఖండ్‌కు ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు పశ్చిమ బెంగాల్‌కు అదనపు ఇన్‌ఛార్జ్‌గా కూడా నియమించబడ్డారు.  కాగా.. సంస్థ ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్‌, కమ్యూనికేషన్‌ విభాగం ఇన్‌చార్జిగా జైరాం రమేష్‌ కొనసాగనున్నారు. అజయ్ మాకెన్ పార్టీ కోశాధికారిగా కొనసాగుతుండగా, మిలింద్ దేవరా, విజయ్ ఇందర్ సింహళ జాయింట్ ట్రెజరర్‌లుగా నియమితులయ్యారు. దీపక్ బబారియాకు ఢిల్లీ, హర్యానా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసిన రెండు రోజుల తర్వాత ఈ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్‌లో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుండి తప్పించడంపై, ఇది తనకు ప్రమోషన్‌గా భావించాలని అన్నారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పట్ల ఎలాంటి జవాబుదారీతనం లేదని దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. అంతకుముందు అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అన్నదమ్ముల పోటీ సిద్ధాంతాన్ని సమర్థించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios