శబరిమల అయ్యప్ప స్వామిని ట్రాన్స్ జెండర్ల బృందం ఈ రోజు దర్శించుకుంది. ఈ నెల 16వ తేదీన వీరు స్వామి వారిని దర్శించుకోవడానికి రాగా.. వీరి అనుమతిని నిరాకరించారు. కాగా.. ఆ బృందం ఈ రోజు స్వామి వారిని దర్శించుకుంది.

ఆలయ ప్రధాన అర్చకుడితో సంప్రదింపుల అనంతరం ట్రాన్స్ జెండర్లకు అనుమతి లభించింది.  దీంతో.. అయ్యప్ప స్వామి నామాన్ని జపిస్తూ.. ట్రాన్స్ జెండర్ల బృందం ఆలయంలోకి అడుగుపెట్టారు.

కాగా.. తమను ఆదివారం ఆలయంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారని.. ఏవేవో కారణాలు చెప్పి.. వెనక్కి పంపించాలని చూశారని అనన్య అనే ట్రాన్స్ జెండర్ ఆరోపించారు. దీంతో.. వారు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి..తమ సమస్యను వివరించినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం అనుమతి ఇవ్వగా... ఆందోళన కారులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.