Asianet News TeluguAsianet News Telugu

మణిపూర్‌ పరిస్థితికి ఆరెస్సెస్ విద్వేష విధానం, బీజేపీ ఓటు రాజకీయాలే కారణం: అఖిలేష్ యాదవ్

Manipur violence: మణిపూర్ దారుణ‌ పరిస్థితికి బీజేపీ ఓటు రాజకీయాలే కారణమ‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మణిపూర్ వీధుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యాదవ్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాల తీరుపై మండిప‌డ్డారు. 
 

RSS hate policy, BJP's vote politics responsible for Manipur situation: Akhilesh Yadav RMA
Author
First Published Jul 20, 2023, 5:02 PM IST

Samajwadi Party president Akhilesh Yadav: మణిపూర్ దారుణ‌ పరిస్థితికి బీజేపీ ఓటు రాజకీయాలే కారణమ‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. మణిపూర్ వీధుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యాదవ్ ఈ ప్రకటన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాల తీరుపై మండిప‌డ్డారు.

వివ‌రాల్లోకెళ్తే.. మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులకు కార‌ణం అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) యే న‌ని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మణిపూర్ పరిస్థితికి ఆరెస్సెస్ విద్వేష రాజకీయాలు, బీజేపీ ఓటు రాజకీయాలే కారణమని ఆయ‌న ఆరోపించారు. సోదరీమణులు, కూతుళ్ల కుటుంబ సభ్యులు బీజేపీ వైపు చూసే ముందు కచ్చితంగా ఒకసారి ఆలోచిస్తారని అన్నారు.

మణిపూర్ వీధుల్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యాదవ్ ఈ ప్రకటన చేశారు. మే నెలలో మ‌ణిపూర్ లో ప్రారంభ‌మైన‌ కూకీ, మైతీ తెగల మధ్య ఘర్షణల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ అమాన‌వీయ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం, బీజేపీలు రాష్ట్రంలోని సున్నితమైన సామాజిక వ్యవస్థను నాశనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, చట్ట పాలనను మొబోక్రసీగా మార్చాయని విమర్శించారు.

"నరేంద్ర మోదీజీ, మీ మౌనాన్ని భారత్ ఎప్పటికీ క్షమించదు. మీ ప్రభుత్వంలో మనస్సాక్షి లేదా సిగ్గు ఉంటే, మీరు పార్లమెంటులో మణిపూర్ గురించి మాట్లాడాలనీ, కేంద్రంలో, రాష్ట్రంలో మీ ద్వంద్వ అసమర్థతకు ఇతరులను నిందించకుండా ఏమి జరిగిందో దేశానికి చెప్పాలని" ఆయన అన్నారు.

కాగా, ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. 'నా హృదయం బాధ, కోపంతో నిండిపోయింది. మణిపూర్ లో జరిగిన ఈ సంఘటన ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటు... యావత్ దేశం సిగ్గుపడింది. ముఖ్యమంత్రులందరూ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రాజస్థాన్ లోనో, చత్తీస్ ఘడ్ లోనో, మణిపూర్ లోనో, దేశంలో ఏ మూలలోనైనా ఇలాంటివి జరిగినా రాజకీయాలకు అతీతంగా స్పంద‌న‌లు ఉండాల‌ని" అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios