Asianet News TeluguAsianet News Telugu

స్మగ్లింగ్ లో కొత్త ట్రెండ్.. బంగారాన్ని ట్యాబ్లెట్లుగా మార్చి..

బంగారం స్మగ్లర్లు రోజుకో కొత్త పద్ధతి కనిపెడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కేరళలోని కోజికోడ్ లో బంగారాన్ని ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. రోజురోజుకూ బంగారాన్ని ఇలా అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 

Rs.53 lakshs worth Gold seized at Kozhikode Airport, Kerala - bsb
Author
hyderabad, First Published Jan 27, 2021, 4:43 PM IST

బంగారం స్మగ్లర్లు రోజుకో కొత్త పద్ధతి కనిపెడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా కేరళలోని కోజికోడ్ లో బంగారాన్ని ట్యాబ్లెట్ల రూపంలోకి మార్చి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. రోజురోజుకూ బంగారాన్ని ఇలా అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 

ఎన్నిసార్లు పోలీసులకు చిక్కుతున్నా.. బంగారాన్ని రహాస్యంగా తరలించే ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. విశ్వప్రయత్నాలు చేసి చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కేరళలో బంగారు స్మగ్లింగ్‌ కేసు పోలీసులను ఆశ్చర్ల్యంలో ముంచెత్తింది.

 బంగారాన్ని ట్యాబ్లెట్లు మాదిరిగా తయారు చేసి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తీరా విమానాశ్రయంలో తనిఖీల వద్ద వచ్చేసరికి అధికారులు గుర్తించారు. ఈ ఘటన కోజికోడ్‌ విమానాశ్రయంలో జరిగింది.

ఒకరు షార్జా నుంచి రాగా, మరో వ్యక్తి దుబాయ్‌ నుంచి వచ్చారు. వారు విమానాశ్రయంలోకి దిగగా వారి ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిశీలించగా షార్జా నుంచి వచ్చిన వ్యక్తి సాక్షుల్లో ట్యాబ్లెట్లు కనిపించాయి. 

వాటిని పరీక్షించగా 478 గ్రాముల బంగారం కనిపించింది. మరో వ్యక్తి వద్ద నుంచి 765 గ్రాముల బంగారం సీజ్‌ చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం 1.24 కిలో గ్రాములు. దాని విలువ రూ.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios