ఎప్పటికైనా అదృష్టం తన తలుపు కొట్టకపోతుందా అని అతను ఆసక్తిగా ఎదురుచూశాడు. అతను ఎదరుచూసిన రోజు నిజంగానే ఎదురైంది. అదృష్టం అతని తలుపుతట్టింది. లాటరీలో అతను రూ.5కోట్లు గెలుచుకున్నాడు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కొడనాడ్ ప్రాంతానికి చెందిన రెజిన్ కె. రవి అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఓ లాటరీ కొనుగోలు  చేశాడు. అది స్టేట్ గవర్నమెంట్ మాన్సూన్ బంపర్ లాటరీ కాగా.. అది తాను గెలుస్తానని అతను కలలో కూడా అనుకోలేదు. అయితే.. ఓ రోజు లాటరీ విన్నర్ ని ప్రకటించేశారు కూడా. ఆ విషయం అతనికి తెలియడానికి రెండు రోజులు పట్టింది.

రెండు రోజుల తర్వాత తాను రూ.5కోట్లు గెలుచుకున్నానని తెలుసుకొని అతను సంబరపడిపోయాడు. కాగా.. అతను ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఓకుమార్తె ఉన్నారు.