UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మందే కాంగ్రెస్ పార్టీ(Congress)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) పార్టీకి రాజీనామా చేశారు. ఆర్పీఎన్ సింగ్ మంగళవారం త‌న రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. ఆయ‌న జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వ్యవహరిస్తున్నారు.   

 UP Assembly Election 2022: ఉత్తర​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే ఉత్తర​ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అదే త‌రుణంలో వ‌ల‌స‌ల ప‌ర్వం మ‌రింత వేగంగా కొనసాగుతోంది. ఇందులో చిన్న‌, పెద్ద నాయకులు పార్టీలు ఫిరాయించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

ఈ త‌రుణంలో కాంగ్రెస్​ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) పార్టీకి రాజీనామా చేశారు. ఆర్పీఎన్ సింగ్ మంగళవారం త‌న రాజీనామా లేఖను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. ఆయ‌న జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ వ్యవహరిస్తున్నారు. యూపీలో ఆర్పీఎన్ సింగ్‌ను కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా చేసింది. ఆర్పీఎన్ సింగ్ యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అతను యూపీలోని పూర్వాంచల్‌లోని పద్రౌనా ప్రాంతానికి చెందిన నేత.

ఈమేరకు ఆర్‌పిఎన్ సింగ్ ట్వీట్ చేస్తూ, ‘దేశం మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ‌.. నేను నా రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. జై హింద్’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, ఆయన బీజేపీలో లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన కాషాయం కండువా కప్పుకోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయ‌న నుంచి ఇలాంటి ప్రకటన రావ‌డం మాత్రం.. కాంగ్రెస్ మాత్రం తీర‌ని లోటునే చెప్పాలి. 

ఆయ‌న రాజీనామా చేయ‌డానికి ప్ర‌ధానం కారణంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్​ నిరాకరించడమేన‌ని వార్త‌లు వస్తున్నాయి.ఆయ‌న‌ యూపీ కుషీనగర్​ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 

రతన్‌జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ .. మూడుసార్లు పద్రౌనా అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. 2009 లోక్‌సభ ఎన్నికలలో RPN Singh విజయం సాధించారు. UPA II ప్రభుత్వ హయాంలో ఉపరితల రవాణా మరియు రోడ్డు శాఖ సహాయ మంత్రిగా, పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా సేవ‌లందించారు. కానీ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజేష్ పాండే చేతిలో 85,540 వేల ఓట్లతో ఆర్పీఎన్ సింగ్ ఓటమి పాలయ్యారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్​ పార్టీకి మరో ఎంపీ కూడా రాజీనామా చేసిన‌ట్టు తెలుస్తోంది. అధిష్టానం తీరును విమ‌ర్శిస్తు.. మాజీ ఎంపీ ఆనంద్​ ప్రకాశ్​ గౌతమ్​ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఉత్తర్​ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడికి పంపించారు.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్​ జరగనుంది.మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.గౌతమ్​.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.