గతంలో హైదరాబాద్ మటన్ బిర్యానీ కూడా రూ.65, ఉడకపెట్టిన కూరగాయలు రూ.12కే లభించేది. సబ్సీడీ కారణంగా చాలా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతోందని చెప్పి.. సబ్సీడీని ఎత్తివేశారు.

జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ సభ్యులకు అతి తక్కువ ధరకే సబ్సీడీలో ఆహారం లభించేంది. కాగా.. ఈ సబ్సీడీని ఇప్పుడు ఎత్తివేశారు. దీంతో క్యాంటీన్ లో ఆహార పదార్థాల రేట్లు భారీగా పెరిగాయి. బయట మార్కెట్ లో ఉన్న ధరకే వీరికి కూడా ఆహారం అందించనున్నారు. సబ్సీడీ తొలగించడం వల్ల సుమారు రూ.8కోట్ల ఆదాయం చేకూరడం గమనార్హం.

కాగా.. సబ్సీడీ ఎత్తివేసిన తర్వాత క్యాంటీన్ లో ఆహారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం.. సింగిల్ రోటీ ధర రూ.3, వెజిటేరియన్ మీల్స్ రూ.100, నాన్ వెజిటేరియన్ లంచ్ బఫెట్ రూ.700, మటన్ బిర్యానీ రూ.150, ఉడకబెట్టిన కూరగాయలు రూ.50కు లభించనున్నాయి. 

కాగా.. గతంలో హైదరాబాద్ మటన్ బిర్యానీ కూడా రూ.65, ఉడకపెట్టిన కూరగాయలు రూ.12కే లభించేది. సబ్సీడీ కారణంగా చాలా ఎక్కువ మొత్తం ఖర్చు అవుతోందని చెప్పి.. సబ్సీడీని ఎత్తివేశారు.

ఇదిలా ఉండగా... పార్లమెంట్ క్యాంటీన్​ను ఇక నుంచి ‘నార్తన్ రైల్వే’కు బదులు ‘ఇండియన్ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్’ నిర్వహించనుందని బిర్లా స్పష్టం చేశారు.

ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ప్రారంభమవుతాయని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అవుతుందని.. లోక్​సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని పేర్కొన్నారు. సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌ ఉంటుందఅన్నారు.