గులాబీ దండ వేస్తే.. వెయ్యి.. ఇప్పుడిదే ట్రెండ్ గురూ.. !!
ఎన్నికలు ఎన్నో గిమ్మిక్కులు చేయిస్తాయి. నాయకులతో నానా నాటకాలు ఆడిస్తాయి. అలాగో ఓటర్లను డబ్బాశతో కొత్త కొత్త ట్రిక్కులు చేసేలా చేస్తాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇలాంటి చిత్రవిచిత్రాలే చోటుచేసుకుంటున్నాయి.

తమిళనాడు, వేలూరులో ఇప్పుడు ఇలాంటిదే ఓ కొత్త ట్రెండ్ పురుడుపోసుకుంది. మమూలుగా ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం ఇంటికి వచ్చిన నేతలకు స్వాగతం పలకడం, హారతులివ్వడం ఎప్పట్నుంచో చూస్తున్నదే. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.
ఓట్ల కోసం ఇంటికొచ్చే అభ్యర్థులకు ఖరీదైన పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారు. రోజా పూలదండలు వేసి మరీ అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా రాణీపేట నియోజకవర్గంలో ఇప్పుడిది ట్రెండ్ గా మారింది. అంతేకాదు ప్రచారం కోసం వచ్చినప్పుడు తమకు ప్రజలు రోజా పూల దండలు వేసేలా చూడాలంటూ అభ్యర్థులు తమ మద్దతు దారులకు ముందుగానే చెప్పి పెడుతున్నారట.
దీంతో మద్దతుదారులు ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. తమ నేతలకు రోజా పూల దండలతో స్వాగతం పలికిన వారికి వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నారట. దీంతో గులాబీ పూల దండలకు గిరాకీ పెరిగిపోయిందట.