తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చెన్నైకి చెందిన కొందరు యువకులు విహారయాత్ర కోసం కారులో ఊటీకి బయలుదేరారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చెన్నైకి చెందిన కొందరు యువకులు విహారయాత్ర కోసం కారులో ఊటీకి బయలుదేరారు.. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఊటీకి సమీపంలో 500 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అటవీశాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిని రవివర్మ, జయకుమార్, ఇబ్రహీం, అమర్‌నాథ్, కెవిన్‌గా గుర్తించారు.