Asianet News TeluguAsianet News Telugu

అధికార, విపక్షాల బాహాబాహీ: రణరంగమైన బీహార్ అసెంబ్లీ

బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు బాహాబాహీకి దిగాయి. రాష్ట్ర మంత్రి రామ్ సుందర్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. మంత్రి రామ్ సుందర్ రాయ్ సోదరుడు నడిపే స్కూల్‌లో అక్రమ మద్యం దొరికింది. 

RJD MLAs stage protest at Bihar Assembly over sale of liquor in state ksp
Author
Patna, First Published Mar 13, 2021, 4:44 PM IST

బీహార్ అసెంబ్లీలో అధికార, విపక్షాల సభ్యులు బాహాబాహీకి దిగాయి. రాష్ట్ర మంత్రి రామ్ సుందర్ రాయ్ రాజీనామాకు ప్రతిపక్షనేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. 

మంత్రి సోదరుడు నడిపే స్కూల్‌లో అక్రమ మద్యం దొరికింది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్జేడీ ఎమ్మెల్యేలతో కలిసి శనివారం బడ్జెట్‌ సమావేశాల నుంచి తేజశ్వి యాదవ్ వాకౌట్‌ చేశారు.

అనంతరం అసెంబ్లీ నుంచి రాజ్‌భవన్‌ వరకు కాలినడకన వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. బీహార్‌ అసెంబ్లీ జేడీయూ, బీజేపీ కార్యాలయంగా మారిందని ఆరోపించారు.

తమ పార్టీ అభిప్రాయాలను సభలో వెల్లడించేందుకు ప్రభుత్వం అనుమతించడం లేదని తేజస్వీ మండిపడ్డారు. ఇది నియంతృత్వ విధానమని మండిపడ్డారు. . ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోందని, విధాన సభలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడం తేజశ్వి యాదవ్‌ విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios