Sanjay Raut: "న‌వ హిందూ ఒవైసీ": రాజ్ థాకరేపై సంజయ్ రౌత్ ఫైర్

Sanjay Raut: మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చింది మహారాష్ట్ర  నవనిర్మాణ సేన. ఈ చ‌ర్చ‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఎంవీఏ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో బీజేపీ నిరుత్సాహానికి గురైందని సంజయ్ రౌత్ అన్నారు. అందుకే  మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.  
 

Rise of new Hindu Owaisi: Sanjay Raut s veiled swipe at Raj Thackeray

Sanjay Raut:  మసీదులపై లౌడ్ స్పీకర్లపై తొల‌గించాలంటూ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేసిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. MNS చీఫ్ రాజ్ థాక‌రేను  న‌వ‌ హిందూ ఒవైసీ అని, అతని పార్టీ న‌వ‌ హిందూత్వ MIM పార్టీగా అభివ‌ర్ణించారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించి హనుమాన్ చాలీసా పఠించాలనే డిమాండ్ల వెనుక బిజెపి హస్తం ఉందని ఆయ‌న ఆరోపించారు. మహారాష్ట్రలో మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు సూచిస్తున్నాయని, అలాగే MVA ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తున్నాయని పేర్కొన్నారు.

మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ  మహారాష్ట్ర నవనిర్మాణ సేన  డిమాండ్ చేస్తోంది. మ‌సీదులపై ఉన్న లౌడ్ స్పీకర్లను మే 3 నాటికి తొలగించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ థాకరే లోగడ అల్టిమేటం ఇచ్చారు. ఒక వేళ మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే.. మసీదుల ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు హన్ మాన్ చాలీసా పారాయణం వినిపిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో తాను ఎవరి ప్రార్థనలకూ వ్యతిరేకం కాదని రాజ్ థాకరే స్పష్టం చేశారు. లౌడ్ స్పీకర్ల వల్ల ప్రజలకు ఎంతో అసౌకర్యం కలుగుతోందంటూ.. ప్రార్థనలు ఏవైనా వారి నివాసాల్లోనే ఆచరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు.

హనుమాన్ జయంతి సందర్భంగా శ‌నివారం సాయంత్రం ముంబైలోని దాదర్‌లో హిందుత్వ కోసం పిచ్‌ను పెంచుతూ, శివసేన 'హనుమాన్ చాలీసా' పఠనాన్ని నిర్వహించింది, అదే సమయంలో MNS చీఫ్ పూణేలో 'మహా హారతి నిర్వ‌హించింది. మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేయడం మరియు హనుమాన్ చాలీసా పఠించడం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సహకారంతో BJP ద్వారా MVA ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మత విద్వేషాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగమ‌ని  రౌత్ ఆరోపించారు. మత వైషమ్యాన్ని సృష్టించే ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించగా, MVA పార్టీలైన శివసేన, NCP మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను త‌మ వైపు.. లాక్కునే ప్ర‌య‌త్నంలో బీజేపీ విఫలమైంద‌ని ఆరోపించారు.

అందుకే..  'నవ్-హిందుత్వ AIMIM, 'నవ్-హిందూ ఒవైసీ' చేత..  మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ ముందుకు వ‌చ్చింద‌నీ, ఇందుకోసం బీజేపీ రాజ్ థాక‌రే కి కాంట్రాక్ట్ ఇచ్చింద‌ని ఆరోపించారు. ఈ ప‌రిస్థితి మ‌రింత తీవ్ర‌త‌ర‌మైతే.. అప్పుడు అసలు ఒవైసీ (AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ) రంగంలో దిగుతార‌నీ, అప్ప‌డూ  ప్రతిదీ అల్లర్లకు దారి తీస్తుందని విమ‌ర్శించారు.  మే మొదటి లేదా రెండవ వారంలో తాత్కాలికంగా శివసేన నాయకుడు, మంత్రి ఆదిత్య థాకరే అయోధ్య పర్యటనను కూడా రౌత్ ప్రకటించారు. "నాసిక్ శివసేన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే యొక్క 'రామరాజ్యం' భావనకు సంబంధించి ఉంటుంది" అని ఆయన చెప్పారు. 1987లో ముంబయిలోని విలేపార్లే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అధినేత బాల్ థాకరే ఇచ్చిన హిందుత్వ నినాదంతో శివసేన విజయం సాధించిందని సేన ప్రధాన ప్రతినిధి తెలిపారు.

 ఏళ్ల తరబడి రామనవమి, హనుమాన్‌ జయంతి వేడుక‌లు ప్రశాంతంగా జరుపుకుంటున్నామని చెప్పారు. కానీ ఈ సంవత్సరం, రామ నవమి నాడు పది రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయనీ, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించి, వాటిని ఈ విధంగా గెలవడమే ఇప్పుడు బిజెపి వ్యూహమ‌ని రౌత్ ఆరోపించారు. మతపరమైన అల్లర్లను ప్రేరేపించడం, ఎన్నికల్లో విజయం సాధించడమ‌నేది బీజేపీ పాల‌సీ అని, బీజేపీ   దేశాన్ని ముక్కలు చేస్తుందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios