Asianet News TeluguAsianet News Telugu

‘లాడ్జీకి వస్తావా?.. ఇంటికి రమ్మంటావా?’... మహిళా సిబ్బందికి రెవెన్యూ అసిస్టెంట్ లైంగిక వేధింపులు..

డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా.. అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్ గౌడ స్పందిస్తూ జగదీశ్ ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు. 

Revenue Assistant sexual harassment of female staff in karnataka
Author
Hyderabad, First Published Jan 26, 2022, 2:22 PM IST

కర్ణాటక : నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్ టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ గా పనిచేసే బీకే జగదీష్ sexual harrassmentచేస్తున్నట్లు ఏడుగురు women staff ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్ ను తాను ‘అన్న’ అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడడాని తెలిపారు.

డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా.. అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్ గౌడ స్పందిస్తూ జగదీశ్ ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి కీచక టీచర్ వీడియో కర్ణాటకలో వైరల్ గా మారింది. సమాజంలో ఆదర్శంగా ఉండి, మంచి పౌరులను తీర్చి దిద్దాల్సిన teachers వక్రమార్గం పడుతున్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన students పాలిట కీచకుల్లా మారి నీచంగా ప్రవర్తిస్తున్నారు. బెదిరించి, భయపెట్టి చిన్నారులను లొంగదీసుకుంటూ.. వారిపై అకృత్యాలకు పాల్పడుతూ school పవిత్రతతను దెబ్బతీస్తున్నారు. అలా పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న head master నీచ ఉదంతం ఒకటి బయటపడింది. 

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం Mysore District హెచ్ డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు WhatsAppలో సర్కిల్ కావడంతో ఆ హెచ్ఎం మీద ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరు వ్యాప్తంగా ఆ వీడియోలు viral కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో నిరుడు డిసెంబర్ లో వెలుగు చూసింది. ప్రాక్టికల్స్ పరీక్షల పేరిట రాత్రి వేళ పదిహేడు మంది పదవ తరగతి చదువుతున్న బాలికలను పాఠశాలకు పిలిచి, వారికి మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో  వెలుగుచూసింది. వివరాల్లోకి వెడితే.. 

నవంబర్ 17వ తేదీ రాత్రి Muzaffarnagar లో పదవ తరగతి చదువుతున్న 17 మంది బాలికలను ఓ కీచక ఉపాధ్యాయుడు CBSE Practical Examసాకుతో వారిని పాఠశాలకు పిలిచాడు. ఉపాధ్యాయుడిని అమాయకంగా నమ్మిన విద్యార్థులు రాత్రివేళ స్కూల్ కు వెళ్లారు. 

అక్కడ ఆ కీచకుడు ఆ బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తరువాత మత్తులోకి జారుకున్న అమ్మాయిలపై ఉపాధ్యాయుడు Sexually harassment చేశాడు. మత్తులోకి జారుకున్న బాలికలు మరుసటి రోజు తేరుకుని ఇంటికి తిరిగి వచ్చారు. అయితే స్పృహలోకి వచ్చాక తమకు జరిగింది తెలిసినా..  ‘ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద్దని.. చెబితే వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని’ నిందితుడైన ఉపాధ్యాయుడు బాలికలను threatening చేశాడు.

ఈ బాలికలు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చారు. దీంతో ఉపాధ్యాయుడిని ఎదురించే ధైర్యం లేక మౌనంగా భరించారు. అయితే ఇందులో ఇద్దరు బాలికల తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్లకు జరిగిన అన్యాయ్యాని ఊరుకోదలుచుకోలేదు. వీరిద్దరూ పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్  ఉత్పాల్ ను సంప్రదించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios