యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 262 నుండి 277 స్థానాలు దక్కించుకొంటుందని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
Uttar Praedesh రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో BJP హవా కన్పించింది. బీజేపీకి 262-277 స్థానాలు దక్కనున్నాయి. సమాజ్ వాదీ పార్టీకి 119 నుండి 134 సీట్లు దక్కనున్నాయని ఆ టీవీ సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి మూడు నుండి 8 స్థానాలు దక్కే అవకాశం ఉందని కూడా ఈ సర్వే తెలిపింది. బీఎస్పీకి 1 నుండి మూడు స్థానాలు మాత్రమే దక్కనున్నాయని ఈ సర్వే వివరించింది.
యూపీ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇవాళ్టితో ఏడు విడుతల్లో పోలింగ్ పూర్తైంది. ఈ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీని గద్దె దింపి అధికారంలోకి రావాలని Samajwadi పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
