Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే జనవరి 26న దేశరాజధాని రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, వాహ‌న‌దారులు పాటించాల్సిన సూచ‌న‌లు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.  

Republic Day 2022: రిపబ్లిక్ డే వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. అయితే, ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. నిత్యం ల‌క్ష‌ల్లో కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. మ‌ర‌ణాలు సైతం అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం, వాహ‌న‌దారులు పాటించాల్సిన సూచ‌న‌లు చేస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. అలాగే, గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌లో పాల్గొనే వారికి సంబంధించి సైతం మార్గ‌ద‌ర్శ‌కాలు వెలువ‌రించారు. కోవిడ్‌-19 రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే వేడుకల్లోకి అనుమతిస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దాంతో పాటు 15 సంవ‌త్స‌రాల లోపు ఉన్న పిల్లలనూ రిపబ్లిక్ డే పరేడ్ కు అనుమతించబోమని ప్రకటించారు. వీటిని అంద‌రూ పాటించాల‌ని సూచించారు. ఢిల్లీ పోలీసులు జనవరి 25 నుంచి జనవరి 26 తేదీలకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. అందులో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. జనవరి 26న ఉదయం 10.20 గంటలకు కవాతు ప్రారంభమై విజయ్ చౌక్ నుండి ఫోర్ట్ గ్రౌండ్స్ వెళ్తుంది.

Scroll to load tweet…

గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ ఈ క్రింది మార్గంలో కొనసాగనుంది. విజయ్ చౌక్-రాజ్‌పథ్-అమర్ జవాన్ జ్యోతి-ఇండియా గేట్-రౌండ్‌అబౌట్ ప్రిన్సెస్ ప్యాలెస్-తిలక్ మార్గ్ వైపు ఎడమవైపు తిరిగి-సి-షడ్భుజిపై ( C-Hexagon-turn left)ఎడమవైపునకు తిరిగి గేట్ నంబర్ 1 నుంచి నేషనల్ స్టేడియంలోకి ప్రవేశిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు వెల్లడిస్తూ.. జనవరి 25 సాయంత్రం 6 గంటల నుండి జనవరి 26న పరేడ్ ముగిసే వరకు రాజ్‌పథ్‌లో విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ అనుమతించబడదు. జనవరి 25వ తేదీ రాత్రి 11 గంటల నుండి రాగి మార్గ్, జనపథ్, మాన్ సింగ్ రోడ్ లో వేడుక‌లు ముగిసే వ‌రకు ఆంక్ష‌లు ఉంటాయి. ఇండియా గేట్ మార్గం మూసివేయ‌బ‌డుతుంది. జనవరి 26న తెల్లవారుజామున 4 గంటల నుంచి తిలక్ మార్గ్, బహదూర్ షా జఫర్ మార్గ్, సుభాష్ మార్గ్‌లలో ట్రాఫిక్‌ను ఇరువైపులా అనుమతించరు.

Scroll to load tweet…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్సు రూట్లలో మార్పులు చేశారు. పార్క్ స్ట్రీట్/ఉద్యన్ మార్గ్, అరమ్ బాగ్ రోడ్ (పహర్‌గంజ్), రౌండ్‌అబౌట్ కమ్లా మార్కెట్, ఢిల్లీ సెక్రటేరియట్ (ఐజీ స్టేడియం), ప్రగతి మైదాన్ (భైరోన్ రోడ్), హనుమాన్ మందిర్ (యమునా బజార్), మోరీ ప్రాంతాల్లో సిటీ బస్సు సర్వీసుల త‌గ్గించనున్నారు. ఘజియాబాద్ నుండి శివాజీ స్టేడియానికి వెళ్లే బస్సులు NH-24, రింగ్ రోడ్డు మీదుగా భైరాన్ రోడ్‌లోకి మ‌ళ్లించ‌నున్నారు. ధౌలా కువాన్ వైపు నుండి వచ్చే అన్ని అంతర్-రాష్ట్ర బస్సులు ధౌలా కువాన్ వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. 

Scroll to load tweet…

పెరేడ్ సమయంలో అన్ని స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, కేంద్రీయ‌ సచివాలయ (సెంట్రల్ సెక్రటేరియట్), ఉద్యోగ్ భవన్ మధ్య ప‌లు స‌మ‌యాల్లో రైలు రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు ఉంటాయి. గ‌ణ‌తంత్ర‌ వేడుక‌ల నేప‌థ్యంలో దేశ రాజ‌ధానిలో పారా-గ్లైడర్‌లు, పారామోటర్లు, హ్యాంగ్ గ్లైడర్‌లు, UAVలు, UASలు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రిమోట్‌గా పైలట్ చేసే ఎయిర్‌క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్‌లు, చిన్న సైజు పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, క్వాడ్‌కాప్టర్లు లేదా విమానం నుండి పారా జంపింగ్ వంటి అన్ని కార్య‌క‌లాపాలపై ఆంక్ష‌లు విధించారు.