Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మంత్రిగా రాజీనామా చేసిన రెండు రోజులకే:తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్

తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలనే ఆయన  కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి విస్తరణ సమయంలో  రవిశంకర్ ప్రసాద్  మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Ravishankar appoints as Tamilnadu governor lns
Author
New Delhi, First Published Jul 10, 2021, 7:09 PM IST

చెన్నై: తమిళనాడు కొత్త గవర్నర్ గా  మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను నియమించారు. అయితే ఈ విషయాన్ని అధికారంగా ప్రకటించల్సి ఉంది.ఇటీవల కేంద్ర మంత్రి పదవికి  రవిశంకర్ ప్రసాద్ రాజీనామ చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ పనిచేశారు. మోడీ ఇటీవల మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించారు. మంత్రివిస్తరణలో భాగంగా కొత్తవారికి అవకాశం కల్పించేందుకు గాను రవిశంకర్  ప్రసాద్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

also read:కేంద్ర మంత్రివర్గ విస్తరణ: మరుసటి రోజే తొలి కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు

తమిళనాడు గవర్నర్  భన్వర్ లాల్ పురోహిత్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఆదివారం నాడు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడానికి ముందు ఆయన ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

 తమిళనాడుకు కొత్త గవర్నర్ ను నియమించవచ్చనే ప్రచారం సాగుతున్న తరుణంలో పురోహిత్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకొంది. పురోహిత్ ఢిల్లీ వెళ్లిన కొద్ది గంటలకే రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు గవర్నర్  గా నియమించారు.రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేసిన సీనియర్ మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ లలో ఎవరో ఒకరిని గవర్నర్ గా ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios