ఆల్ రౌండర్ రవీండ్ర జడేజా చిక్కుల్లో పడ్డాడు. సింహంతో సెల్ఫీ దిగి వివాదంలో చిక్కుకున్నాడు. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ దూరమైన జడేజా తాజాగా గుజరాత్ లోని సఫారీకి వెళ్లాడు. అక్కడ జడేజాకు ఓ సింహం గుంపు ఎదురయ్యింది. 

ఆల్ రౌండర్ రవీండ్ర జడేజా చిక్కుల్లో పడ్డాడు. సింహంతో సెల్ఫీ దిగి వివాదంలో చిక్కుకున్నాడు. గాయంతో ఇంగ్లండ్ సిరీస్ దూరమైన జడేజా తాజాగా గుజరాత్ లోని సఫారీకి వెళ్లాడు. అక్కడ జడేజాకు ఓ సింహం గుంపు ఎదురయ్యింది. 

మూడు సింహాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే వాటిని వీడియో తీశాడు. ఆతరువాత అక్కడే సింహం పిల్లతో ఫొటో దిగాడు. అంతటితో ఊరుకోకుండా దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. నిజంగా ఇది గొప్ప ఎక్స్ పీరియన్స్.. రోడ్ ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేశానంటూ కామెంట్ కూడా పెట్టాడు.

అయితే ఇక్కడ జడేజా సింహం పిల్లతో ఫోటో దిగడం అతన్ని దెబ్బకొట్టింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ ఐ కేటగిరీలో ఉన్న జంతువులతో ఫొటోలు తీసుకునే అవకాశం లేదు. 

అయితే ఈ విషయం తెలియని జడేజా సింహం పిల్లతో ఫొటో దిగి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు. జడేజా తీసిన ఫొటోలు పరిశీలించిన అటవీ అధికారులు అవి గుజరాత్ తో తీసుకున్నవి కాదంటున్నారు. అవి ఆఫ్రికన్ సింహాలని ఒక ప్రకటనలో అటవీ అధికారులు తెలిపారు. 

2018లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు జడేజా అక్కడి సఫారిలో తీసుకున్న ఫొటో అయి ఉండే అవకాశం ఉంది. తాజాగా అప్పటి వీడియోనే మళ్లీ షేర్ చేసి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయమై జడేజా ఇప్పటివరకు ఏమీ వివరణ ఇవ్వలేదు, ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

అయితే గతనెలలో బర్డ్ ఫ్లూ ఎక్కువగా ఉన్న టైంలో చేపలకు, పక్షులకు ఆహారం వేసి ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. ఆసీస్‌ పర్యటనలో భాగంగా మూడో టెస్టులో బ్యాటింగ్ టైంలో జడేజా బొటనవేలికి బంతి బలంగా తగిలింది. జడేజాను పర్యవేక్షించిన వైద్యులు అతనికి కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.