Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి కావడంలేదని డిప్రెషన్ తో మహిళా ఎస్సై ఆత్మహత్య.. !

పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్ఐ గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్లోని రత్‌లామ్‌ ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో కవిత సోలంకి అనే మహిళ ఎస్సై గా విధులు నిర్వహిస్తోంది. 

Ratlam : Depressed about not getting married, woman sub-inspector commits suicide - bsb
Author
Hyderabad, First Published Jul 9, 2021, 4:15 PM IST

మన సమాజంలో అమ్మాయిలు ఎంత ఎదిగినా, ఎంత చదువుకుని ఉన్నతోద్యోగాలు చేస్తున్నా.. పెళ్లి చేసుకోకపోతే వేధించి సాధిస్తారు. పెళ్లి జీవితానికి అవసరమే.. కానీ అదే పనిగా పెళ్లి, పెళ్లి అంటూ వేధిస్తే ఎంత ఉన్నతోద్యోగంలో ఉన్న మహిళకైనా మానసిక వేదన తప్పదు. అలా ఓ ఎస్సై పెళ్లి కావడం లేదనే మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. 

తాజాగా పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్ఐ గా పనిచేసే ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్లోని రత్‌లామ్‌ ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో కవిత సోలంకి అనే మహిళ ఎస్సై గా విధులు నిర్వహిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్. ఎంతో కష్టపడి ఎస్సై పోస్ట్ సాధించుకుంది. సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు.

సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఓ ఘటన ఎదురైంది .పెళ్లి ఎప్పుడు అంటూ ఇంటి దగ్గర ఉన్న వాళ్లంతా ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇప్పుడే కాదు ఇంటికి వెళ్ళిన ప్రతిసారీ ఇదే ప్రశ్న ఎదురవుతుండడంతో.. ఎంతో ఆవేదన చెందింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరి తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది.

బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు గురువారం ఆమె మరణించింది. మృతురాలి ఇంటి వద్ద నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు, వివాహంపై ఇరుగుపొరుగువారి మాటలకు సమాధానం చెప్పలేక  అలసి పోయానని రాసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios