22 ఏళ్ల యువతిపై నాలుగు రోజుల్లో 40 మంది అత్యాచారం

Raped By 40 Men For 4 Days In Guest House
Highlights

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే మహిళలు భయపడే విధంగా దేశంలో పరిస్థితులు తయారయ్యాయి. రోజూ ఏదో ఒక చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో ఈ సంఘటలు మరీ దారుణంగా జరుగుతున్నాయి. ఇటీవలే ఓ 11 ఏళ్ల మైనర్ బాలికపై ఏకంగా 18 మంది అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో దారుణం జరిగింది.  ఈ తాజా ఘటనలో యువతిపై 40 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజదానిలో చోటుచేసుకుంది.

ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చండీఘడ్ పట్టణంలో ఓ 22 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి నివాసముంటోంది. అయితే  ఈ వీరి పేదరికాన్ని, యువతి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని భర్త స్నేహితుడు ఈమెపై కన్నేశాడు. యువతికి ఓ గెస్ట్ హౌస్ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సదరు వ్యక్తి ఈ నెల 15న పట్టణ శివారులోని  మోర్సి హిల్స్ గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లాడు.  అక్కడ ఆమెను బంధించి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

అంతటితో ఆగకుండా తన స్పేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఇలా 15 వ తేదీ నుండి 18వ తేదీ వరకు అక్కడే బంధించి దాదాపు 40 మంది యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.  ఇలా నాలుగు రోజుల పాటు యువతికి నరకం చూపించారు. 

అయితే ఎలాగోలా వారి నుండి తప్పించుకున్న మహిళ పేరుగా పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న మణివజ్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే గెస్ట్ హౌస్ వద్ద పనిచేసే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి ద్వారా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టడానికి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

loader