Asianet News TeluguAsianet News Telugu

మూడు నెలల కిందట అత్యాచారం.. మైనర్ బాలికకు నిప్పు పెట్టి..

సదరు బాలిక కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో.. సరిగ్గా అత్యాచారం జరిగిన మూడు నెలలకు మరోసారి బాలికపై దాడి జరిగింది. 

Rape Survivor, 15, Dies Of Burn Injuries In UP, 3 Arrested: Police
Author
Hyderabad, First Published Nov 18, 2020, 8:56 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మూడు నెలల కిందట ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాధను దిగమింగి తన జీవితం తాను బతుకుతున్న ఆ బాలికపై మరోసారి దాడికి పాల్పడ్డారు. ఒంటికి నిప్పు అంటించారు. దీంతో.. తీవ్రగాయాలై బాలిక కన్నుమూసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ జిల్లాకు  చెందిన ఓ మైనర్ బాలికపై ఆగస్టు నెలలో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను జైల్లో శిక్ష అనుభవవిస్తున్నాడు. కాగా.. నిందితుడు అరెస్టు అయిన నాటి నుంచి.. కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాధితులకు బెదిరింపులు మొదలయ్యాయి.

కేసు వెనక్కి తీసుకోవాలంటూ నిందితుడి మామ, స్నేహితులు.. బాధితులను పలుమార్లు బెదిరించారు. అయితే.. సదరు బాలిక కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో.. సరిగ్గా అత్యాచారం జరిగిన మూడు నెలలకు మరోసారి బాలికపై దాడి జరిగింది. మంగళవారం ఉదయం బాలిక కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది.

తొలుత.. నిందితుల బంధువులు, స్నేహితుల ఒత్తిడి తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని అందరూ భావించారు. కాగా.. బాలిక తండ్రి నోరు విప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడి మామ, స్నేహితులు బలవంతంగా తన కూతురిపై పెట్రోల్ పోసి ఆ తర్వాత నిప్పు అంటించారని అతను వాపోయాడు.

కాగా.. సదరు బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయింది. కాగా.. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికపై దాడిచేసిన ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios