Asianet News TeluguAsianet News Telugu

వీధి కుక్కపై అత్యాచారం.. వీడియో వైరల్, వ్యక్తిపై కేసు నమోదు...

వీధికుక్కపై అత్యాచారం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Rape on stray dog, Video goes viral, case registered against person in delhi - bsb
Author
First Published Sep 16, 2023, 10:03 AM IST

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ వీడియో వెలుగు చూసింది. ఓ వ్యక్తి వీధికుక్కపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. పీపుల్ ఫర్ యానిమల్స్ వాలంటీర్ల తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అనేకసార్లు వీధికుక్కలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తమకు అందాయి. సాక్ష్యాధారాలైన వీడియోలు కూడా దొరికాయి. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో నిందితుడు వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ వీడియో అతని గిడ్డంగి తలుపు కింద నుండి రికార్డ్ చేయబడింది. నిందితుడిపై జంతు హక్కుల స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

బంగారు గొలుసు అమ్మనివ్వలేదని.. భార్యను చంపి, మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికిన భర్త..

“నిందితుడిపై పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయి. వీడియో రుజువులు చూశాం. దీన్ని ఇంతటితో ఆపాలని.. మూగజీవుల మీద జరుగుతున్న అకృత్యాల్ని ఆపాలనుకున్నాం. అందుకే కేసు నమోదు చేయడానికి పోలీసులను ఆశ్రయించాం. పోలీసులకు అందుబాటులో ఉన్న అన్ని వివరాలను వారికి అందించాం. ఎఫ్‌ఐఆర్‌ చేయాలని అభ్యర్థించాం" అని పీపుల్ ఫర్ యానిమల్స్, ఎన్ జీవో వాలంటీర్ తెలిపారు.

"ఈ కేసులో సీనియర్ అధికారి జోక్యం చేసుకున్న తరువాతే నిందితుడి మీద.. ఐపీసీ, సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది. అయితే, ఎఫ్ఐఆర్ ఉన్నా. నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు" అని స్వచ్ఛందసంస్థ వాలంటీర్ తెలిపారు. ఫిర్యాదుదారుల ప్రకారం, నిందితుడు సెప్టెంబర్ 6న వీధికుక్కపై అత్యాచారం చేస్తూ కెమెరాకు చిక్కాడు. 

నిందితుడు వీడియో తీసిన వ్యక్తి ఫోన్‌ను లాక్కున్నాడు, అయితే పోలీసుల జోక్యంతో, మొబైల్ ఫోన్ తిరిగి వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు.

“మళ్లీ సెప్టెంబర్ 13న, దారితప్పిన ఓ శునకంపై అత్యాచారం చేస్తూ పట్టుబడ్డాడు. అతను తన తాత్కాలిక గిడ్డంగిలో విచ్చలవిడిగా దానిపై అత్యాచారం చేసేవాడు. ఈ విషయం మాకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించాం” అని వాలంటీర్ చెప్పాడు. అయితే, వీడియోలో ఉన్న నిందితుల గుర్తింపును నిర్ధారించాల్సి ఉందని, ఆపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, “భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 268, 377, 428, 429, జంతు హింస నిరోధక చట్టం 11 ప్రకారం నిందితులపై సెప్టెంబర్ 15 న రాజౌరి గార్డెన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. వీడియోలో నిందితుడి ముఖం అస్పష్టంగా ఉంది. ముందు అతని గుర్తింపును నిర్ధారించాల్సి ఉంది. చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోబడతాయి” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios