రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తనను ఇబ్బంది పెట్టనని.. తాను రాజకీయాల్లోకి రాలేనని ఆయన అభిమానులను కోరారు. తన నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించేశానని.. దయచేసి.. రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించ వద్దని.. ఆ విషయంలో తనను ఇబ్బంది పెట్టవద్దని చెప్పడం గమనార్హం.

రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కొన్ని సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నారు. అయితే..  ఈవిషయంలో రజీనీకాంత్ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చేశారు. 2020లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమంటూ స్వయంగా ప్రకటించారు. దీంతో.. అభిమానులు పండగ చేసుకున్నారు. పార్టీ ఇదే.. గుర్తు ఇదే అంటూ హడావిడి కూడా చేసేశారు. అయితే.. సడెన్ గా ఆయన అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గారు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ ప్రకటిస్తారని ఆశపడ్డారు. కానీ.. ఇక రాజకీయాల జోలికి రానంటూ ప్రకటించేశారు.

 

దీంతో తలైవా పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారని భావించిన అభిమానులకు నిరాశ కలిగింది. అనారోగ్యం కారణంగా తాను రాజకీయాల్లోకి రాలేనని రజినీకాంత్ స్పష్టం చేశారు.

అయితే రజినీకాంత్‌ అభిమానులు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. తలైవా తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, రజనీ మక్కళ్‌ మండ్రం బాద్యతల నుంచి, మండ్రం నుంచి తొలగించబడిన పలువురితో కలిసి చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆందోళన కూడా చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన రజినీకాంత్ తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చారు.