Asianet News TeluguAsianet News Telugu

కరోనా వింత : మహిళకు ఐదు నెల్లలో, 31 సార్లు పాజిటివ్‌.. !

పాజిటివ్ అనే మాట వింటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు.. ఇక మనకు ఒక్కసారి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందంటే చాలు.. జీవితం ఇక శూన్యం అన్నంతంగా మారిపోతుంది పరిస్థితి. అలాంటిది ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. 

Rajasthan woman, infected with coronavirus, tests positive for 31 times in five months - bsb
Author
Hyderabad, First Published Jan 23, 2021, 10:34 AM IST

పాజిటివ్ అనే మాట వింటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు.. ఇక మనకు ఒక్కసారి కరోనా టెస్టులో పాజిటివ్ వచ్చిందంటే చాలు.. జీవితం ఇక శూన్యం అన్నంతంగా మారిపోతుంది పరిస్థితి. అలాంటిది ఓ మహిళకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 సార్లు కరోనా పాజిటివ్ వచ్చింది. 

విచిత్రం ఏమిటంటే అలా వచ్చినా ఆమె బాగానే ఉంది. ఆమెకు కరోనా లక్షణాలే లేవు. ఇంకా చెప్పాలంటే 7,8 కిలోల బరువు కూడా పెరిగిందట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.. అంతేకాదు పరీక్ష చేసుకున్నా ప్రతిసారి ఆమెకు పాజిటివ్‌ అనే వస్తోంది. దీన్ని చూసి వైద్యులే నివ్వెరపోయారు.  వైద్య నిపుణులు ఆమె నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నారు.

రాజస్థాన్‌లోని అప్నాఘర్‌ ఆశ్రమానికి చెందిన శారదకు కరోనా లక్షణాలు ఏమీ లేవు. అయినా కూడా ఆమెకు కేవలం ఐదు నెలల్లోనే 31 సార్లు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆమెను భరత్‌పూర్‌ జిల్లాలోని ఆర్‌బీఎం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. 

గతేడాది ఆగస్టు 20వ తేదీన ఆమెకు తొలిసారి కరోనా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యుడు భరద్వాజ్‌ తెలిపాడు. అలా ఇప్పటివరకు శారదకు 31 సార్లు కరోనా పరీక్షలు చేయగా.. ప్రతిసారి పాజిటివ్‌ వచ్చిందని వివరించారు. ప్రారంభంలో ఆమె అస్సలు నిల్చోడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది.

గతంలో ఆమె అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి వైద్యం చేయించుకున్నారు. ఇంకా ఆశ్చర్యంగా ఆమె 7-8 కిలోల బరువు పెరగడం గమనార్హం. తొలిసారి వచ్చిన వైరస్‌ చికిత్స తీసుకున్నా శరీరంలో ఉంటుందని.. అందువల్లే ఆమెకు తరచూ పాజిటివ్‌ వచ్చిందని వైద్యులు భావిస్తున్నారు. 

ఆమె కడుపు భాగంలో కరోనా వైరస్‌ ఆనవాళ్లు ఉండడంతో ఈ విధంగా జరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి నిర్ధారణ రాలేదు. ఆమె నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios