Coronavirus: కోవిడ్-19 ఆంక్ష‌లు ఎత్తేసిన రాజ‌స్థాన్‌.. ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ రీ-ఓపెన్

Coronavirus: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో రాజస్థాన్ ప్రభుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. ఈ క్రమంలోనే  ఫిబ్రవరి 1 నుంచి 10-12 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో భౌతిక తరగతులను తిరిగి ప్రారంభించాలని పేర్కొంటూ క‌రోనా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. 
 

Rajasthan Eases Covid-19 restrictions; Schools To Resume Physical Classes From February 1. Details HERE

Coronavirus: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో రాజస్థాన్ ప్రభుత్వం క‌రోనా ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది. ఈ క్రమంలోనే  ఫిబ్రవరి 1 నుంచి 10-12 తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో భౌతిక తరగతులను తిరిగి ప్రారంభించాలని పేర్కొంటూ క‌రోనా (Coronavirus) మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర అడిష‌న్ చీఫ్ సెక్ర‌ట‌రీ (హోమ్‌) అభ‌య్ కుమార్ (Additional Chief Secretary (Home) Abhay Kumar) జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం.. క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇదివ‌ర‌కు క‌ఠిన ఆంక్ష‌లు విధించింది. విద్యాసంస్థ‌ల‌ను తాత్కాలికంగా మూసివేసింది.  అయితే, ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం కాస్త త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆంక్ష‌లు స‌డ‌లించింది. భౌతికంగా పాఠ‌శాల‌ను త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 10-12 త‌ర‌గతుల వారికి భౌతికంగా క్లాసులు ప్రారంభం కానుండ‌గా,  ఫిబ్రవరి 10న  6-9 తరగతుల విద్యార్థులకు శారీరక తరగతులు పునఃప్రారంభించబడతాయి.

అయితే,  తల్లిదండ్రులు లేదా సంరక్షకులు రాతపూర్వకంగా అనుమతి ఇచ్చిన తర్వాతే విద్యార్థులను చదువుల కోసం క్యాంపస్‌కు అనుమతిస్తామని కూడా పేర్కొన్నారు. అలాగే, ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు సైతం కొన‌సాగుతాయ‌ని పేర్కొంది.

రాజ‌స్థాన్ స‌ర్కారు జారీ చేసిన కొత్త (Coronavirus) మార్గ‌ద‌ర్శ‌కాల ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.. 

1. రాష్ట్రంలో తిరిగి పాఠ‌శాల‌లు ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. త‌ల్లిదండ్రుల అభిష్టానం మేర‌కు పిల్లలను స్కూళ్లకు పంపే నిర్ణయం  తీసుకొవచ్చు. 
2. రాష్ట్రంలోని మార్కెట్లు, ఇతర వ్యాపార సంస్థలు ఇప్పుడు రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచ‌వ‌చ్చు.  
3. ఆదివారం నాటి పబ్లిక్ డిసిప్లిన్ కర్ఫ్యూను ప్రభుత్వం రద్దు చేసింది.
4. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ  మాత్రం అలాగే అమల్లో ఉంటుంది.
5. జనవరి 31 తర్వాత రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్న ఉద్యోగుల  వివ‌రాల‌ను సంబంధిత యాజమాన్యాలు వెల్ల‌డించాల‌ని పేర్కొంది. 
6. అన్ని రకాల సమావేశాల‌కు హాజ‌రు గరిష్ట సంఖ్య 100 మంది మించ‌కూడ‌ద‌ని పేర్కొంది. 
6. కొత్త మార్గదర్శకాలు జనవరి 31 నుంచి అమలులోకి రానున్నాయి.

ఇదిలావుండ‌గా, రాజస్థాన్‌లో శుక్రవారం 8,125 కొత్త COVID-19 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 21 మంది కోవిడ్-19 (Coronavirus) ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసుల్లో అత్య‌ధికం  జైపూర్‌లో 2,300, జోధ్‌పూర్‌లో 707, ఉదయ్‌పూర్‌లో 657, భరత్‌పూర్‌లో 478, కోటాలో 458, అల్వార్‌లో 408 కేసులు న‌మోదయ్యాయి. కొత్త‌గా రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ సైతం క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు శనివారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. పెద్ద‌గా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. ఈ విష‌యాన్ని సంబంధిత వ‌ర్గాలు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాయి. “గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా శ‌నివారం స్వయంగా కోవిడ్-19 పరీక్ష (Coronavirus) చేయించుకున్నారు. అతని పరీక్ష ఫలితాలు వైరస్‌కు పాజిటివ్‌గా తేలింది.  క‌రోనా ల‌క్ష‌ణాలు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు.  ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌ను క‌లిసిన‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌నీ, ఐసోలేష‌న్ ఉండాలి” అని రాజస్థాన్ రాజ్ భవన్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios