The Kashmir Files: రాజస్థాన్ లో 'ది కాశ్మీర్ ఫైల్స్ విడుదల సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా లో పెట్టుకుని మంగళవారం (మార్చి 22) నుండి రాజస్థాన్‌లోని కోటాలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144 విధించబడుతుందని కోట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ప్రకటించింది. ఏప్రిల్ 21 వరకు కోటాలో కోడ్ అమలులో ఉంటుంది. సెక్షన్ 144 కోడ్‌ను ఉల్లంఘిస్తే గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడుతుందని జిల్లా అధికారులు హెచ్చరించారు.
The Kashmir Files: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రానికి రోజురోజుకు విశేష ఆధారణ వస్తోంది. ఈ చిత్రంలో 90వ దశకంలో కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్ పై జరిగిన దారుణాలను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై స్పందించారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ చిత్రానికి అధికార బీజేపీ మద్దతు ఇవ్వడంతో రాజకీయ రంగు పులుముకుంది. దీంతో బీజేపేతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ సమైక్యతకు భంగంవాటిల్లేలా ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది. గత వారం ఈ చిత్రంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా పేరుతో దేశంలో వివిధ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని అశోక్ గెహ్లాట్ అన్నారు.
తాజాగా ఈ చిత్రం విడుదలను దృష్టిలో పెట్టుకుని రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కోటాలో రేపట్నుంచి 144 సెక్షన్ విధించింది రాజస్థాన్ ప్రభుత్వం. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ The Kashmir Filesస్క్రీనింగ్‌తో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, కోటాలో రేపటి నుండి ఏప్రిల్ 21 వరకు సెక్షన్ 144 విధించబడుతుందని కోట జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ప్రకటించింది. .
కోటా జిల్లాలో చిత్ర ఆధారంగా ధర్నాలు, ప్రదర్శనలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేదించింది. ఏప్రిల్ 21 వరకు కోటాలో కోడ్ అమలులో ఉంటుంది. సెక్షన్ 144 కోడ్‌ను ఉల్లంఘిస్తే గరిష్టంగా మూడేళ్ల శిక్ష పడుతుందని జిల్లా అధికారులు హెచ్చరించారు. అలాగే.. ఈ చిత్రంపై మీడియాలో గానీ, సోషల్ మీడియాలో చర్చలు నిర్వహించడ చేయరాదనీ, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని పాడు చేయవద్దని, ఎలాంటి చర్చ అవసరం లేదని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు.
మరోవైపు.. 90వ దశకం ప్రారంభంలో కాశ్మీరీ పండిట్ల వలసలు, వారిపై జరిగిన మారణహోమం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ The Kashmir Files కి వివిధ బిజెపి నేతృత్వంలోని రాష్ట్రాల్లో పన్నుమినహాయింపు ప్రకటించాయి. ప్రధానంగా గుజరాత్, మధ్యప్రదేశ్,గోవా, కర్నాటక,త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ మూవీగా ప్రకటించాయి. ఇప్పటికే ఈ సినిమాను ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు కూడా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని చెబుతున్నారు. మరోవైపు, ఇటీవల విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం దేశ సామాజిక ఐక్యత మరియు సమగ్రతకు పెను హాని కలిగించే పరిస్థితిని సృష్టిస్తోందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం అన్నారు.
