Asianet News TeluguAsianet News Telugu

Indian Railways: భూకంపం వ‌చ్చినా.. రైలు సేవ‌ల కోసం ఎస్‌వోపీ రూపొందిస్తున్న ఇండియ‌న్ రైల్వే !

Indian Railways: ఇండియ‌న్ రైల్వే స‌రికొత్త విధానంలో మ‌రింతగా త‌న సేవ‌ల‌ను మెరుగుప‌ర్చుకుంటోంది. దీనికి అనుగుణంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే భూకంపం సంభవించిన వెంటనే రైళ్లను నడపడానికి భారతీయ రైల్వేలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించే ప్రక్రియలో నిమ‌గ్న‌మైంది. 

Railways mull SOP for post-earthquake train operations
Author
Hyderabad, First Published Jan 20, 2022, 2:41 AM IST

 Indian Railways: ఇండియ‌న్ రైల్వే స‌రికొత్త విధానంలో మ‌రింతగా త‌న సేవ‌ల‌ను మెరుగుప‌ర్చుకుంటోంది. దీనికి అనుగుణంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో వేగం పెంచింది. ఈ నేపథ్యంలోనే భూకంపం సంభవించిన వెంటనే రైళ్లను నడపడానికి భారతీయ రైల్వేలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) రూపొందించే ప్రక్రియలో నిమ‌గ్న‌మై ఉన్నాయి. భూకంపం సంభవించిన తర్వాత రైళ్లను సురక్షితంగా నడిపించడంపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని రైల్వే బోర్డు జోనల్ రైల్వే జనరల్ మేనేజర్‌లకు (Indian Railways) లేఖ రాసింది. భూకంపం సంభవించిన తర్వాత రైళ్లను నడపడానికి రైల్వే ఎటువంటి మార్గదర్శకాలు లేదా నియమాలను జారీ చేయలేదని ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ CP గుప్తా ఈ సమస్యను ఫ్లాగ్ చేసిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత.. ఇండియ‌న్ రైల్వే ఉన్నత యంత్రాంగం SOP రూపొందించాలని నిర్ణయించింది.  సంబంధిత విరాల‌ను రైల్వే వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

భారతీయ రైల్వేల (Indian Railways) మీదుగా ప్రయాణీకుల/సరుకు రవాణా రైలు కార్యకలాపాలకు సంబంధించిన మాన్యువల్ అయిన జనరల్ & సబ్సిడరీ రూల్స్ (G&SR), భూకంపం తర్వాత రైళ్లను నడపడం గురించి ఎటువంటి చర్యను నిర్దేశించలేదు. ఇండియన్ రైల్వేస్ పర్మనెంట్ వే మాన్యువల్, ఇండియన్ రైల్వేస్ బ్రిడ్జ్ మాన్యువల్ కూడా, సివిల్ ఇంజినీరింగ్ మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణను నియంత్రిస్తున్న ఇది భూకంపం తర్వాత ట్రాక్, వంతెనలు మొదలైన వాటికి ఎలాంటి నష్టం జరగకుండా చూసేందుకు ఒక యంత్రాంగంగా నిర్వహించాల్సిన తనిఖీ గురించి ప్రస్తావించలేదని ఓ  అధికారి తెలిపారు. ఓ సీనియర్ రైల్వే అధికారి  తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలోని 58.6 శాతం భూభాగం మధ్యస్థం నుండి చాలా ఎక్కువ తీవ్రతతో కూడిన భూకంపాలకు గురవుతుంది. వరదలు, కొండచరియలు విరిగిపడటం, సునామీ, మంచు హిమపాతాలు మొదలైన రైలు కార్యకలాపాలను ప్రభావితం చేసే ప్రకృతి వైపరీత్యాల జాబితాలో భూకంపాలు చేర్చబడ్డాయ‌ని అన్నారు. 

భూకంపాలు సునామీ, వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి వాటిని ప్రేరేపించగలవు కాబట్టి రైలు కార్యకలాపాలపై బహుళ ప్రభావాలను  చూపుతాయి. కాబట్టి భూకంపం సంభవించిన తర్వాత సురక్షితమైన రైలు కార్యకలాపాల కోసం SOPని కలిగి ఉండటం చాలా అవసరం అని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ సీనియ‌ర్ రైల్వే అధికారి పేర్కొన్నారు. రైలు కార్యకలాపాల ప్రణాళిక కోసం విపత్తు నిర్వహణ పథకంలో చేర్చబడిన ప్రకృతి వైపరీత్యాలలో భూకంపాలు కూడా ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రయాణీకుల, సరుకు రవాణా రైళ్ల నిర్వహణను నియంత్రించే G&SR పుస్తకంలో నిర్దిష్ట నియమాలు రూపొందించబడలేద‌ని పేర్కొంటున్నారు. .

అయితే, భారతీయ రైల్వేల (Indian Railways) ఆమోదంతో జారీ చేయబడిన మెట్రో రైళ్ల కోసం, భూకంపం సంభవించినప్పుడు, “ట్రాఫిక్ కంట్రోలర్ అన్ని రైళ్లను వెంటనే ఆపాలనీ, భూకంపం తగ్గిన తర్వాత, రైలు కదలికకు ట్రాక్ సురక్షితంగా ఉందని, తదుపరి స్టేషన్ వరకు అడ్డంకులు లేకుండా ఉన్నాయని పరిశీలించిన తర్వాత ట్రాఫిక్ కంట్రోలర్ ప్రతి స్ట్రాండెడ్ రైలు ఆపరేషన్‌ను  త‌క్కువ వేగంతో న‌డ‌ప‌వ‌చ్చ‌ని పేర్కొంటున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios