అలా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారి వద్ద నుంచి ఓ మహిళా రైల్వే అధికారిణి... ఏకంగా ఫైన్ల రూపంలో కోటి రూపాయలు వసూలు చేసింది. 

మనలో చాలా మందికి టికెట్ లేకుండా రైలు ఎక్కే అలవాటు ఉంటుంది. ఒక్కోసారి కావాలనే కొందరు టికెట్ కొనకుండా రైలు ఎక్కేస్తూ ఉంటారు. కొందరేమో... రైలు వెళ్లిపోతుందనే హడావిడిలో తీసుకోని ఉండరు. కారణాలు ఏవైనా టికెట్ లేని ప్రయాణం చేసేవారు చాలా మందే ఉంటారు. అలా ప్రయాణం చేస్తూ చాలా మంది టికెట్ కలెక్టర్లకు బుక్కై ఫైన్లు కట్టిన వారు లేకపోలేరు. కాగా... అలా టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారి వద్ద నుంచి ఓ మహిళా రైల్వే అధికారిణి... ఏకంగా ఫైన్ల రూపంలో కోటి రూపాయలు వసూలు చేసింది. 


దక్షిణ రైల్వేకు చెందిన చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రోసలిన్ ఆరోకియా మేరీ ఇటీవల రూ. రూ. 1.03 కోట్లు టిక్కెట్ లేని ప్రయాణికుల నుండి సక్రమైన పద్ధతిలో ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ఆమె సాధించిన విజయానికి రైల్వే మంత్రిత్వ శాఖ కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం.

Scroll to load tweet…

రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని షేర్ చేసి... ఆమె తన విధుల పట్ల ఎంత నిబద్ధత తో పనిచేశారో తెలియజేస్తూ ఆమెను ప్రశంసించారు.

" రైల్వే CTI (చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్) శ్రీమతి రోసలిన్ అరోకియా మేరీ తన విధుల పట్ల దృఢ నిబద్ధతను చూపించారు. టికెట్ లేని ప్రయాణికుల నుండి రూ. 1.03 కోట్ల జరిమానాలు వసూలు చేసిన భారతీయ రైల్వే టిక్కెట్-చెకింగ్ సిబ్బందిలో మొదటి మహిళ" అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.

తోటి ఉద్యోగులు సైతం ఆమెను ప్రశంసించారు. కాగా... ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. నెటిజన్లు సైతం ఆమెను ప్రశంసిస్తుండటం విశేషం.