పార్లమెంట్ సాక్షిగా ప్రధానికి కన్నుగీటిన రాహుల్

Rahul Gandhi winks after hugging PM Narendra Modi in Lok Sabha
Highlights

ఇవాళ పార్లమెంట్ లో అరుదైన సన్నివేశం ఆవిష్కృతమంది. ఎప్పుడూ ఉప్పూ నిప్పులా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరు పార్లమెంట్ లోనే ఆలింగనం చేసుకున్నారు. వ్యంగంగానో, మనస్పూర్తిగానో కానీ అవిశ్వాస తీర్పాన ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్ నేరుగా వెళ్లి ప్రధానితో కరచాలనం చేసి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తన సీట్లోకి వచ్చి కూర్చున్న రాహుల్ మళ్లీ ప్రధాని వైపు చూసి కన్నుగీటాడు. అయితే ఈ దృశ్యాలు లోక్ సభ కెమెరా కంటికి చిక్కాయి. 

అంతకు ముందు టిడిపి ఎంపీలు ప్రవేశపెట్టిన అవివ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ మాట్లాడారు.  దేశంలో గారడీ ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రతి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని మెదటి గారడీ చేశారన్నారు. ఇక 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని రెండో గారడీ చేశారని తెలిపారు. ఇలా గారడీలతో ప్రభుత్వాన్ని నడపొచ్చు కానీ ప్రజలకు సంక్షేమాన్ని అందించలేమని రాహుల్ దుయ్యబట్టారు.

టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంలో తనకు బాధ కనిపించదని రాహుల్ తెలిపారు. ప్రధాని ఇచ్చిన హామీనే అమలుకాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజా సేవకుడినని చెప్పుకునే ప్రధాని మోదీ తమ పార్టీ సభ్యుల అవినీతికి కొమ్ముకాస్తున్నారన్నారు. లేకపోతే మోదీ మిత్రుడు అమిత్ షా కొడుకు ఆస్తులు 11 రెట్లు ఎలా  పెంచుకున్నాడని ఆరోపించారు.

 ప్రాన్స్ తో భారత ప్ఱభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందని రాహుల్ తెలిపారు. ప్రాన్స్ అధ్యక్షుడు తనతో స్వయంగా మాట్లాడాడని తెలిపిన రాహుల్, యుద్ద విమానాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్నారు.అక్రమాలు జరగలేదని నిరూపించగలరా? అంటూ ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు. 
 
loader