Asianet News TeluguAsianet News Telugu

అధ్య‌క్షుడిని అవుతానో? లేదో?  అప్పుడే తేలుతుంది: రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాతే.. తాను పార్టీ అధ్య‌క్షుడిని అవుతానో.. లేదో అనేది అప్పుడే  క్లియ‌ర్‌గా తెలుస్తాయ‌ని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తాను ఏం చేయాలో అనేది కూడా నిర్ణ‌యించుకున్నాన‌నీ, అందులో ఎటువంటి గంద‌ర‌గోళం లేద‌ని రాహుల్ అన్నారు.

Rahul Gandhi Said When Asked If He'll Be Congress President
Author
First Published Sep 9, 2022, 3:52 PM IST

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వం. ప్రజలతో మమేక‌మ‌వ్వాల‌నే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన కార్య‌క్ర‌మమే ‘భారత్‌ జోడో’. ఈ పాద‌యాత్రకు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పందన వ‌స్తుంది. బుధవారం సాయంత్రం క‌న్యాకుమారిలో ప్రారంభ‌మైన‌ ఈ యాత్ర నేడు మూడో రోజుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు. 

భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షుడ‌వుతాడని ప్ర‌శ్నించ‌గా.. ఎన్నికలు జ‌రిగినా త‌రువాత.. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడవుతానో.. లేదో తేలిపోతుందని, అప్పటి వరకు ఆగాలని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడవ్వాలన్న అభ్యర్థనపై తాను నిర్ణయం తీసుకున్నాననీ, ఆ విష‌యంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపారు. పార్టీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. అప్పుడూ సమాధానం చెబుతానని అన్నారు.  తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయకపోతే.. ఎందుకు పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించండ‌ని, అప్పుడూ సమాధానం చెబుతానని అన్నారు.

పాదయాత్ర ద్వారా క్షేత్ర‌స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ల‌భించింద‌నీ, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేసిన నష్టాన్ని తెలుసుకుంటున్నానని అన్నారు. తాను చేస్తున్న యాత్ర‌పై బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇష్టానూసారంగా వ్యాఖ్యాలు చేస్తున్నాయనీ, తాను ప్రజలతో మమేకం కావడానికి ఈ యాత్ర చేస్తున్నామని రాహుల్‌ గాంధీ తెలిపారు. 

ప్రస్తుతం అన్ని సంస్థలూ భాజపా ప్ర‌భుత్వ‌ ఆధీనంలో ఉన్నాయని, ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చేందుకు వాటిని వాడుకుంటుంద‌ని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నార‌నీ ప్ర‌శ్నించగా.. త‌న దగ్గర ఎలాంటి సందేశం లేదని స‌మాధానిచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొననున్న రాహుల్ గాంధీ సహా 119 మంది నేతలను 'భారత్ యాత్రికులు'గా కాంగ్రెస్ పేర్కొంది. ఈ యాత్ర‌ 3,570 కిలో మీట‌ర్లు సాగ‌నున్న‌ది. 

41 వేల మంది టీ షర్ట్‌పై బీజేపీ మండిపాటు..

ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా భారత ప్రజల హృదయాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు బీజేపీ ప్రతి విషయంలోనూ ఆయనను చుట్టుముట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక ట్వీట్ చేయబడింది, దీనిలో కోల్లెజ్ చిత్రం చూపబడింది. ఇందులో రాహుల్ గాంధీ ఒకవైపు టీ షర్ట్ ధరించి ఉండగా, ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ వైపు టీ షర్ట్ కనిపించింది. ఇందులో టీ షర్ట్ ధర రూ.41,257 అని రాసి ఉంది. అదే సమయంలో, చిత్రంపై 'లుక్ ఇండియా' అనే క్యాప్షన్ వ్రాయబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios