Asianet News TeluguAsianet News Telugu

Rahul Gandhi: మ‌రో వివాదంలో రాహుల్.. ‘పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్’ లేకుండానే లండ‌న్ ప‌ర్య‌ట‌న‌!

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం లండ‌న్ పర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. భార‌త విదేశాంగ శాఖ నుంచి పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ రాకుండానే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.
 

Rahul Gandhi did not have political clearance for London visit?
Author
Hyderabad, First Published May 25, 2022, 11:16 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం యూకే పర్యటనలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న‌ ప‌లు వివాదాలు త‌ల్లెత్తిన విష‌యం తెలిసిందే..  ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ లేబర్ పార్టీ మాజీ నేత జెరెమీ కార్బిన్‌తో రాహుల్ గాంధీ భేటీ కావ‌డం ప‌లు వివాదాల‌కు దారి తీసింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. అయితే..  తాజాగా మ‌రో వివాదంలో రాహుల్ గాంధీ చిక్కున్నాడు. అయితే.. భార‌త విదేశాంగ శాఖ నుంచి పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ రాకుండానే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే స‌మ‌యంలో పార్ల‌మెంట్ స‌భ్యులంద‌రూ విదేశాంగ శాఖ క్లియ‌రెన్స్ తీసుకోవాల్సి వుంటుంది. 

ఏ ఎంపీ అయినా.. విదేశీ ప‌ర్య‌ట‌నకు సంబంధించిన స‌మాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో క‌నీసం మూడు వారాల ముందే వుంచాలి. ఈ నిబంధ‌న‌ను రాహుల్ గాంధీ ప‌ట్టించుకోన్న‌ట్టు తెలుస్తోంది. తోటి ఎంపీ, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, రాజకీయ క్లియరెన్స్‌తో సహా అన్ని సంబంధిత అనుమతులను కలిగి ఉన్నారని వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ లండన్‌లో పాల్గొనే కార్యక్రమానికి ఆర్జేడీ అధినేత కూడా వెళ్లారు.

అయితే...  కాంగ్రెస్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఎంపీలు అధికారిక ప్రతినిధి బృందంలో భాగమైతే తప్ప.. మిగిత‌ వారికి ప్రభుత్వం నుండి అలాంటి క్లియరెన్స్ అవసరం లేదని వాదించింది. పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లండన్ పర్యటనకు "పొలిటికల్ క్లియరెన్స్" అవసరమని వ‌స్తున్న‌ మీడియా కథనాలను కొట్టిపారేస్తుంది. విదేశాల్లో ప‌ర్య‌టించే వారు అధికారిక ప్రతినిధి బృందంలో భాగమైతే తప్ప, ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి అవసరం లేదని చెప్పారు.

ఎంపీలు అధికారిక ప్రతినిధి బృందంలో భాగం అయితే తప్ప, వారికి ప్రధానమంత్రి లేదా ప్రభుత్వం నుండి రాజకీయ అనుమతి అవసరం లేదు" అని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా అన్నారు. "రాహుల్ గాంధీ ఏ అధికారిక ప్రతినిధి బృందంలో భాగం కానందున ప్రభుత్వం నుండి ఎటువంటి రాజకీయ క్లియరెన్స్ తీసుకోవలసిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. 
 
.ఇదే స‌మ‌యంలో పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, సోషల్ మీడియా కన్వీనర్ రుచిరా చతుర్వేదితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్టారు. ఎలాంటి క్లియరెన్స్ అవసరం లేదని పునరుద్ఘాటించారు.
 
ఒక రోజు ముందు.. రాహుల్ గాంధీ... యూకే లేబర్ లీడర్ జెరెమీ కార్బిన్‌తో భేటీ కావ‌డం. ఇందుకు సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కార్బిన్‌తో రాహుల్‌ భేటీ కావడం వివాదానికి దారితీసింది. 

బ్రిటన్‌ మాజీ లేబర్‌ నేత జెరెమీ కార్బిన్‌ భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ఆరోపించారు. అమిత్ మాలవీయ ద్వారా బిజెపి, రాహుల్ గాంధీ సమావేశాన్ని విమర్శించింది, ఇది కార్బిన్  మునుపటి ప్రకటనలను బట్టి స్పష్టమైంది.

కానీ కాంగ్రెస్ అదే భాషలో అమిత్ మాలవ్యపై కౌంట‌ర్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌లతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు స‌మావేశ‌మ‌య్యారని ప్ర‌శ్నించారు.  ఈ అంశంపై బీజేపీ స్పందించాలని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు
 

Follow Us:
Download App:
  • android
  • ios