కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ గాంధీలు హత్రాస్ అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. కాలినడకన బాధితురాలి స్వగ్రామమైన బూల్‌గదికి చేరుకున్న రాహుల్, ప్రియాంక తదితరులు ఆమె కుటుంబాన్ని ఓదార్చారు.

ఘటన గురించి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి పరిస్దితి తెలుసుకుని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వీరి రాక నేపథ్యంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు.

Also Read:బ్రేకింగ్: హత్రాస్ కేసును సీబీఐకి అప్పగించిన యోగి ఆదిత్యనాథ్

అంతకుముందు యూపీ సరిహద్దుల్లో ఢిల్లీ- నోయిడా హైవేపై హైడ్రామా నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని లాఠీఛార్జీకి దారి తీసింది.

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ... ఓ కార్యకర్తను లాఠీఛార్జీ నుంచి తప్పించేందుకు స్వయంగా ఆమె తోపులాటలోకి వెళ్లారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంకలకు హత్రాస్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.