దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచార ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీబీఐ విచారణకు ఆదేశించారు. బాధితురాలి కుటుంబాన్ని అధికారులు కలిసిన తర్వాత సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కాగా, పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది.

ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక హత్రాస్‌ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, భీమ్‌ ఆర్మీ చీష్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాల్గొన్నారు.

దోషులను ఉరితీయాలని. ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఇక ఇందుకు సంబంధించి అలహాబాద్‌ హై కోర్టు యూపీ అధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.