రాయ్‌బరేలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

గాంధీ పేరు వింటే మదిలో మెదిలే నియోజకవర్గం రాయ్‌బరేలి. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీష్ శర్మ, సోనియా గాంధీ, రాజ్ నారాయణ్‌లు ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. ఇందిరా గాంధీని నెత్తిన పెట్టుకున్న జనమే.. ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెను ఓడించి షాకిచ్చారు. ఇందిరమ్మపై రాజ్ నారాయణ్ గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 1952లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఇక్కడ ఆ పార్టీ 17 సార్లు విజయం సాధించగా.. బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. తన కంచుకోటకు బీటలు వారకుండా చూసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వరుసగా నాలుగు సార్లు రాయ్‌బరేలి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక గాంధీ పేరు వచ్చింది.

Raebareli lok sabha elections result 2024 ksp

రాయ్‌బరేలి.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం. నెహ్రూ గాంధీ కుటుంబానికి, కాంగ్రెస్‌కు కంచుకోట. గాంధీ పేరు వింటే మదిలో మెదిలే నియోజకవర్గం రాయ్‌బరేలి. ఇందిరా గాంధీ, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ, అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీష్ శర్మ, సోనియా గాంధీ, రాజ్ నారాయణ్‌లు ఇక్కడి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. 1952 నుంచి నేటి వరకు రాయ్‌బరేలి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. 

రాయ్‌బరేలి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. ఇందిరమ్మకు షాకిచ్చిన రాజ్‌నారాయణ్ :

ఇందిరా గాంధీని నెత్తిన పెట్టుకున్న జనమే.. ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెను ఓడించి షాకిచ్చారు. ఇందిరమ్మపై రాజ్ నారాయణ్ గెలిచి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. 1971 ఎన్నికల్లోనూ ఇందిరపై పోటీ చేసిన రాజ్ నారాయణ్ ఆమె ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అంతేకాదు.. ఆరేళ్ల పాటు ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. 

రాయ్‌బరేలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024.. కంచుకోటలో వీక్‌గా కాంగ్రెస్ :

1952లో నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే హవా. ఇక్కడ ఆ పార్టీ 17 సార్లు విజయం సాధించగా.. బీజేపీ రెండు సార్లు, జనతా పార్టీ ఒకసారి గెలిచాయి. రాయ్‌బరేలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బచ్చరావన్, హర్చంద్‌పూర్, రాయ్ బరేలి, సారేని, ఉంచాహర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలి లోక్‌సభ పరిధిలోని ఐదు శాసనసభ స్థానాల్లో మూడు చోట్ల సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ రెండు చోట్ల గెలిచాయి.

2019 లోక్‌సభ ఎన్నికల నాటికి రాయ్‌బరేలిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,02,248 మంది. వీరిలో పురుషులు 8,96,132 మంది.. మహిళలు 8,06,066 మంది . 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సోనియా గాంధీకి 5,34,918 ఓట్లు.. బీజేపీ అభ్యర్ధి దినేష్ ప్రతాప్ సింగ్‌కు 3,67,740 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 1,67,178 ఓట్ల తేడాతో రాయ్‌బరేలిని నిలబెట్టుకుంది. 

రాయ్‌బరేలి ఎంపీ ( పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. ప్రత్యక్ష ఎన్నికలకు సోనియా దూరం :

తన కంచుకోటకు బీటలు వారకుండా చూసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వరుసగా నాలుగు సార్లు రాయ్‌బరేలి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా ఈసారి పోటీ చేయడం లేదని ప్రకటించడంతో తెరపైకి ప్రియాంక గాంధీ పేరు వచ్చింది. ఫిరోజ్, ఇందిర, సోనియాల వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్నారు. రాయ్‌బరేలి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సమాజ్‌వాదీ పార్టీ బలంగా వుండటంతో కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో వుంది. సోనియా గాంధీ కూడా బరిలో నుంచి తప్పుకోవడంతో కమలనాథులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి సోనియా చేతుల్లో ఓటమిపాలైన దినేష్ ప్రతాప్ సింగ్‌ మరోసారి బరిలో నిలుస్తారా , లేదా అన్నది చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios