నిందితుడు విగ్రహం ఉన్న గర్భగుడి గుమ్మంమీదికి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత అతను ఆలయం లోపల ఉన్న దేవతా విగ్రహానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది గమనించిన ఘటనా స్థలంలోనే ఉన్న పూజారి, ఇతర భక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పంజాబ్‌ : Punjab, పాటియాలాలోని కాళీదేవి ఆలయంలో విగ్రహాన్ని అపవిత్రం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు arrest చేశారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వగా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు social mediaలో వైరల్‌గా మారింది.

నిందితుడిపై IPCలోని 295-A (ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలు, వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఏ వర్గానికి చెందిన వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

నిందితుడు విగ్రహం ఉన్న గర్భగుడి గుమ్మంమీదికి ఎక్కినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత అతను ఆలయం లోపల ఉన్న దేవతా విగ్రహానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది గమనించిన ఘటనా స్థలంలోనే ఉన్న పూజారి, ఇతర భక్తులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

నిందితుడు నైన్‌కలన్‌ గ్రామ నివాసి అని పాటియాలా డిప్యూటీ సూపరింటెండెంట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఘటన మీద పాటియాలా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హర్పాల్ సింగ్ మాట్లాడుతూ, పోలీసులు ఆరోపించిన హత్యాచార ఘటనను ధృవీకరించి, నిందితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించి అల్లకల్లోలం సృష్టించేందుకు 'దుష్ట శక్తులు' ప్రయత్నిస్తున్నాయని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అన్నారు. ఈ విద్రోహ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించారు.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కష్టపడి సంపాదించిన శాంతి, సామరస్యానికి భంగం కలిగించడం ద్వారా అల్లకల్లోలం సృష్టించడానికి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని చన్నీ అన్నారు. శాంతిభద్రతలు కాపాడాలని ముఖ్యమంత్రి చన్ని ప్రజలను కోరారు.

హిందువులు, సిక్కుల పుణ్యక్షేత్రాల మధ్య మత విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు పంజాబ్ వెలుపలి శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆరోపిస్తూ శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఫుటేజీని ట్వీట్ చేశారు.

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనను ఖండించారు. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు పదే పదే జరగడాన్ని సహించేది లేదన్నారు. రాష్ట్రంలో వాతావరణం చెదిరిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను అని సింగ్ అన్నారు.

'నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలి. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో ఒక యువకుడిని బలిదానం చేసేందుకు ప్రయత్నించిన దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.

ఇదిలా ఉండగా, సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని శనివారం కొట్టి చంపడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 19 రాత్రి శనివారం 24 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న ఒక యువకుడు గోల్డెన్ టెంపుల్ లోపలికి దూసుకెళ్లాడు. అక్కడ పూజలో ఉంచిన తల్వార్‎ను తీసేందుకు ప్రయత్నించాడు. 

అయితే అక్కడున్న భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. తీవ్ర గాయాలతో అతను మరణించాడు. అనంతరం మృతదేహాన్ని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.తొలుత ఆ యువకుడు గర్భగుడి లోపల గోల్డెన్ గ్రిల్స్ దూకి తల్వార్ తీసుకుని, ఒక సిక్కు పూజారి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ పఠిస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అతన్ని వెంటనే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ టాస్క్‌ఫోర్స్ సభ్యులు పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. 

అతన్ని ఎస్‌జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా.. ఆగ్రహంతో ఉన్న అక్కడి వారు తీవ్రంగా కొట్టారని చెప్పారు. మృతుడిని యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను స్వర్ణ దేవాలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు. అతనితో పాటు ఎవరైనా వున్నారా అని తెలుసుకోవడానికి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.