కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరో రైతు అమరుడయ్యాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘూలో పంజాబ్‌కు చెందిన 40 ఏళ్ల రైతు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

40 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో విషం తాగి తనువు చాలించాడు. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలని ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తున్నారు.

Also Read:కేంద్రం vs రైతులు, ఎవరి పట్టుదల వారిదే: ఎనిమిదో సారి చర్చలు విఫలమే

ఇప్పటికే చలికి తట్టుకోలేక కొందరు, ప్రమాదాల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అన్నదాతలు భగ్గుమంటున్నారు.

ఇప్పటికే ఎనిమిది సార్లు రైతుల సంఘాల నేతలతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. కానీ రైతులు మాత్రం చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్నారు.