Asianet News TeluguAsianet News Telugu

Punjab Elections 2022: సిద్దూ కోసం పాక్ ప్ర‌ధాని లాబీయింగ్ : అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Punjab Elections 2022: నవజ్యోత్ సింగ్ సిద్ధూని టార్గెట్ చేస్తూ పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  పంజాబ్ మంత్రిగా సిద్ధూను తిరిగి నియమించాలని పాకిస్థాన్ ప్ర‌ధాని తనను కోరాడ‌ని వ్యాఖ్యానించారు. 
 

Punjab elections 2022 pakistan pm imran khan lobbied for navjot sidhu says captain amarinder singh
Author
Hyderabad, First Published Jan 24, 2022, 8:24 PM IST

Punjab Elections 2022: పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. ప్రచార పర్వం మరింత వేడెక్కింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ను టార్గెట్ చేస్తూ  రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పాకిస్థాన్ మద్దతు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
గ‌త కొద్ది నెల కిత్రం.. నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. అప్పటి ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ మ‌ధ్య  వివాదం ఓ రేంజ్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ  సొంత పార్టీలో ఉంటూ విమర్శించుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలతో పార్టీలో సంక్షోభం తలెత్తింది. సిద్ధూను మంత్రి పదవి నుంచి తొలగించారు అప్ప‌టి సీఎం కెప్టెన్​.

 ఈ క్రమంలో సిద్ధూను మ‌ళ్లీ తన కేబినెట్‌లోకి తిరిగి తీసుకోవాలని సిఫార్సు చేస్తూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) తరఫు నుంచి తనకు ఓ సందేశం వచ్చినట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ మేరకు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అమరీందర్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించారు.
 
నవజ్యోత్ సింగ్ సిద్ధూను తొలగించిన తర్వాత... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి త‌నకో సందేశం వచ్చిందని, అందులో సిద్ధూ పాత స్నేహితుడని, సిద్ధూని ప్రభుత్వంలోకి తిరిగి తీసుకుంటే కృతజ్ఞతతో ఉంటారని, మ‌రోసారి సరైన పనితీరు కనబరచకపోతే అప్పుడు సిద్ధూని తొలగించాలని  ఆ సందేశం సారంశమ‌ని అమరీందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్  ఉన్నప్పుడు తన క్యాబినెట్ నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూను తొలగించారు. ఆ తర్వాత పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సిద్ధూను నియమించడాన్ని కూడా వ్యతిరేకించారు. అప్పట్లో వారిద్దరి మధ్య వివాదంతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పాడింది. ఆ తర్వాత అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి.. పీఎల్సీ పార్టీని ఏర్పాటు చేశారు. 

అయితే.. పంజాబ్ ఎన్నికల సందర్భంగా అమరీందర్ సింగ్ పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రీసెంట్‌గా 22 మందితో కూడిన మొదటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ క్ర‌మంలో  పాటియాలా అర్బన్ నుంచి అమరీందర్ సింగ్ బరిలోకి దిగుతోన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios