వేర్పాటువాద సంస్థలతో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధాలు ఉన్నాయని, అరవింద్ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రాసిన లేఖకు సమాధానం ఇచ్చారు. సిక్కు ఫర్ జస్టిస్ సంస్థ ఆప్ కు మద్దతు ఇచ్చిందనే విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు.
Punjab Election news 2022 : భారత దేశ ఐక్యత, సమగ్రతతో ఆడుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (amit shah)అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party)కి సిక్కు ఫర్ జస్టిస్ (sikh for justice) సంస్థతో సంబంధాలు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi)లేఖ రాశారు. దీనికి అమిషా తాజాగా స్పందించారు. ఆప్ పై వచ్చిన ఆరోపణలను తాను తాను తీవ్రంగా పరిశీలిస్తానని ఆయన సమాధానం ఇచ్చారు.
నిషేధించిన వేర్పాటువాద సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని అమిత్ షా అన్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రతతో ఆడుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని చన్నీకి ఆయన హామీ ఇచ్చారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు వేర్పాటువాదులతో చేతులు కలపడంతో పాటు పంజాబ్‌ను, దేశాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి వెళ్లడం అత్యంత ఖండనీయమని కూడా హోంమంత్రి అన్నారు.
పంజాబ్ సీఎం చన్నీ హోం మంత్రికి రాసిన లేఖలో.. ఆప్ తో సిక్కు ఫర్ జస్టిస్ నిరంతరం టచ్ లో ఉందని అన్నారు. పంజాబ్ (punjab) అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ కు ఆ సంస్థ మద్దతు ఇస్తోందని తెలిపారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) పై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారని ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ (kumar vishwas) చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని చన్నీ గతంలో ప్రధాని మోదీని కోరారు. పంజాబీల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధానిని కోరారు. వేర్పాటువాదులకు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (rahul gandhi) కూడా కేజ్రీవాల్ నుంచి వివరణ కోరారు.
అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన కొట్టి పారేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో అన్ని పార్టీలూ ఒక్కటి అయ్యాయని ఆయన అన్నారు. పంజాబ్ లో అకాలీదళ్ (akalidal), బీజేపీ (bjp), కాంగ్రెస్ (congress)లు ఏకం అయ్యాయని ఆరోపించారు. ప్రియాంక గాంధీ (priyanka gandi), రాహుల్ గాంధీ (rahul gandi), నరేంద్ర మోడీ (narendra modi), సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (sukhbeer singh badhal), చరణ్ జిత్ సింగ్ చన్నీ (charanjith singh channi), కెప్టెన్ అమరీందర్ సింగ్ (captain amrinder singh)లు అందరూ ఆప్‌కు వ్యతిరేకంగా గ్రూప్‌గా ఏర్పడ్డారని అన్నారు. వారంతా ఒకటే భాష మాట్లాడుతున్నారని చెప్పారు. రాత్రికి రాత్రే వీడియో కాల్‌లో చాటింగ్ చేసినట్టు లేదా కాన్ఫరెన్స్ కాల్‌లో మాట్లాడుకున్నట్టు ఒకటే మాట మాట్లాడుతున్నారని వివరించారు. వారంతా తనను వేర్పాటువాది అని, టెర్రరిస్టు అని అంటున్నారని, ఇది ఎంతటి హాస్యాస్పదం అని పేర్కొన్నారు. ఒక వేళ నిజంగానే తాను టెర్రరిస్టు(Terrorist)ను అయితే.. తనపై ఎందుకు విచారణ జరిపించరని ప్రశ్నించారు. మోడీజీ ఎందుకు తనను అరెస్టు చేయించరని నిలదీశారు. పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.