Punjab Election 2022: పంజాబ్ రాజ‌కీయాలు స‌ర‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మయం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అన్ని పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్రక‌టిస్తూ.. ప్ర‌చార హోరును సాగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ పార్టీ 86 మంది అభ్య‌ర్థుల తన తొలి జాబితాను విడుద‌ల చేసింది.  

Punjab Congress candidate list 2022: ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో అన్ని పార్టీలు ప్ర‌చార హోరును ముమ్మ‌రంగా కొన‌సాగిస్తుతున్నాయి. ఎన్నిక‌లు జ‌ర‌గున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒక‌టి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో అన్ని పంజాబ్ రాజ‌కీయ వేడేక్కుతున్నాయి. అన్ని పార్టీలు త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టిస్తూ.. ప్ర‌చారంలో వేగం పెంచుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పంజాబ్ ఎన్నిక‌ల బ‌రిలో అభ్య‌ర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం 86 మంది అభ్యర్థుల జాబితాను ప్ర‌క‌టించింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu ) అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Channi) చంకౌర్ సాహిబ్ నుంచి పోటీకి దిగనున్నారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌ మోగా నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దించుతోంది కాంగ్రెస్‌. 

Scroll to load tweet…

కాగా, పంజాబ్‌లో (Punjab Election 2022) ఫిబ్రవరి 14న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే, ఈ సారి పంజాబ్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నున్నాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌.. కొత్త పార్టీని పెట్టారు. బీజేపీతో క‌లిసి పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీద‌ళ్ పార్టీలు సైతం ఎన్నిక‌ల్లో త‌మ‌దైన త‌ర‌హాలో ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. దీనికి తోడు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దులో వివాదాస్ప‌ద మూడు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న ఉద్య‌మం కొన‌సాగించిన రైతు సంఘాల్లోని ఓ వ‌ర్గం కొత్త పార్టీని స్థాపించింది. పంజాబ్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ది. దీంతో పంజాబ్ ఎన్నిక‌లు ఈ సారి ఉత్కంఠ రేపుతున్నాయి. 

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీటి ఇటీవ‌లే కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఎలాగైన రాష్ట్రంలో అధికారా చేజిక్కించుకోవాల‌ని చూస్తున్న అమ‌రీంద‌ర్ ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచ‌డంతో పాటు పొత్తుల కోసం ఇత‌ర పార్టీల‌తో ముమ్మ‌రంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఇటీవ‌లే ప‌లువురు బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ సైతం పంజాబ్ లో పాగా వేయాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలోనే వినూత్న ప్ర‌చారాల‌తో దూసుకుపోతున్న‌ది. ఇప్ప‌టికే కేజ్రీవాల్ అనేక సార్లు పంజాబ్ లో ప‌ర్య‌టించారు. స్థానికంగా ఉన్న రైతుల పోలాలకు వెళ్లి మ‌రి వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.. తాము అధికారంలోకి వ‌స్తే వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.