గోడకూలి 14మంది చనిపోయిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణేలోని కుంద్వా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గోడ కూలి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కుంద్వా ప్రాంతంలో నిలిపి ఉన్న ఆటోలు, కార్లపై గోడ కూలడంతో మృతుల సంఖ్య పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.