Asianet News TeluguAsianet News Telugu

చీఫ్ జస్టిస్ కి క్లీన్ చిట్.. సుప్రీం కోర్టు ఎదుట ఆందోళన

చీఫ్ జస్టిస రంజన్ గగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బాబ్డి నేతృత్వంలోని కమిటీ తోసి పుచ్చిన సంగతి తెలిసిందే. రంజన్ గగోయ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. 

Protests Outside Supreme Court After Panel Clears Chief Justice
Author
Hyderabad, First Published May 7, 2019, 1:11 PM IST

చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బాబ్డి నేతృత్వంలోని కమిటీ తోసి పుచ్చిన సంగతి తెలిసిందే. రంజన్ గగోయ్ కి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. కాగా... సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మహిళా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

మంగళవారం సుప్రీం కోర్టు ఎదుట మహిళా న్యాయవాదులు, పలువురు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు తేల్చిచెప్పారు.

గత కొంత కాలం క్రితం రంజన్ గగోయ్ పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నెల 10..11 తేదీ లలో ఆయన తన నివాసంలో తనను లైంగిక వేధింపులకు గురి చేసి. .. క్రిమినల్ కేసు బనాయించి తనను మాన సికంగా హింసిస్తున్నా రంటు మహిళ సంచలన ఆరోపణలు చేసింది.

ఈ కేసులో సుప్రీం కోర్టు సోమవారం తుదీ తీర్పు వెలువరించింది. గగోయ్ కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. కాగా... సుప్రీం ఇచ్చిన తీర్పుపై మహిళా న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios