న్యూడిల్లీ: ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి అతిత్వరలో అధ్యక్ష పీఠాన్ని అదిరోహించనున్న జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారి వివిధ అంశాలపై చర్చించుకున్నారు. మంగళవారం తాను ఫోన్ లో బైడెన్ తో మాట్లాడినట్లు... ఈ సందర్బంగా వివిధ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు ప్రధాని సోషల్ మీడియా వేదికన వెల్లడించారు. 

''అమెరిక అధ్యక్షుడిగా ఎన్నికయిన జో బైడెన్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా తామిద్దరం ఇండో-అమెరికా సబంధాలపై చర్చించాం. అలాగే కోవిడ్19 మహమ్మారి, వాతావరణ మార్పులు మరియు ఇండో-పసిపిక్ ప్రాంతంలో పరస్పర సహకారం గురించి చర్చించాం'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 

read more  నేనే గెలిచా.. డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ ట్వీట్

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిదెన్  ప్రమాణస్వీకారం చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని రోజుల పాటు సాగిన ఓట్ల లెక్కింపులో ఎట్టకేలకు బైడెన్ అధికారికంగా విజయం సాధించారు. బైడెన్ అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు వార్త వెలువడగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ బైడెన్ తోపాటు, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమల హారిస్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 

గతంలో వైస్ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు సైతం భారత్ తో సంబంధాలను బలపర్చడానికి చేసిన కృషి అమోఘం అని, ఇప్పుడు కూడా అమెరికా భారత్ బంధాలను మరింత బలపరిచి, ఇరు దేశాల మైత్రిలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడానికి వేచి చూస్తున్నట్టుగా గతంలోనే మోడీ పేర్కొన్నారు. తాజాగా ఇరు దేశాల సంబంధాలపై ఫోన్ ద్వారా చర్చించారు.