Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్య భారత్ నాలక్ష్యం మోదీ: ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాని

సాంకేతికత, అభివృద్ధి మనిషి శారీరక శ్రమను తగ్గించాయని ప్రధాని మోదీ తెలిపారు. ఫిట్నెస్ అనేది ప్రతీ ఒక్కరి జీవిత విధానమని చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ జీవితంలో ఒక భాగమని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో చాలా మంది వాకింగ్ కూడా మానేశారని చెప్పుకొచ్చారు. శరీరానికి శ్రమ కలిగించి పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యభారత దేశంగా మార్పు చెందాలని మోదీ ఆకాంక్షించారు.

prime minister narendra modi launches fit india movement at new delhi
Author
New Delhi, First Published Aug 29, 2019, 11:35 AM IST

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్, మన్ కీ బాత్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన మోదీ తాజాగా ఫిట్ ఇండియా మూవ్ మెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఫిటెనెస్ ప్రాముఖ్యతను యువత గుర్తించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

ఫిట్నెస్ పై ఆయా పాఠశాల్లో అవగాహన కల్పిద్దామంటూ స్పష్టం చేశారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందన్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. క్రీడాకారులు  ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. 

సాంకేతికత, అభివృద్ధి మనిషి శారీరక శ్రమను తగ్గించాయని ప్రధాని మోదీ తెలిపారు. ఫిట్నెస్ అనేది ప్రతీ ఒక్కరి జీవిత విధానమని చెప్పుకొచ్చారు. ఫిట్నెస్ జీవితంలో ఒక భాగమని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో చాలా మంది వాకింగ్ కూడా మానేశారని చెప్పుకొచ్చారు. శరీరానికి శ్రమ కలిగించి పూర్తి ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యభారత దేశంగా మార్పు చెందాలని మోదీ ఆకాంక్షించారు.

చైనా దేశం విజన్ 2030 హెల్దీ చైనా అనే విజన్ తో ముందుకు వెళ్తోందని తెలిపారు. అలాగే ఆస్ట్రేలియా అదేమార్గంలో ప్రయాణిస్తోందని తెలిపారు. డైట్ అనేది ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ఎవరిని అడిగినా డైట్  అంటున్నారని చెప్పుకొచ్చారు. 

డైట్ కోసం కాకుండా శరీరానికి శ్రమ కలిగిస్తే మంచి ఫిట్నెస్ తో ముందుకు వెళ్తామన్నారు. ఇకపోతే ఈ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ కార్యక్రమంపై ఇటీవల తాను నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా గుర్తు చేసినట్లు తెలిపారు. 

ప్రముఖ క్రీడాకారుడు, మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని జాతీయ క్రీడాదినోత్సవంగా జరుపుకుంటున్నామని అలాగే ఇకపై ఫిట్ ఇండియా మూవ్ మెంట్ కార్యక్రమం కూడా జరగాలని ఆకాంక్షించారు. 

క్రీడలను ప్రోత్సహించేలా ఈ ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ఉద్యమాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ పూర్తి ఆరోగ్యంగా ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్రమోదీ. మహాత్మగాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రముఖ గుర్తింపు ప్రాతాలను పరిశీలించి ప్రకృతిని పర్యావరణాన్ని ఆస్వాదించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios