రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో రెండో విడత టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న ఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో కోవింద్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్ కూడా టీకా వేయించుకున్నారు.