రాజ్యాంగాన్ని రక్షించే రాష్ట్రపతి ప్రస్తుతం భారతదేశానికి అసవరం అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో విపక్షాలు అన్నీ కలిసి నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ఆమె విపక్ష పార్టీలకు లేఖ రాశారు. 

త్వ‌ర‌లో భార‌త రాష్ట్రప‌తి ప‌ద‌వికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం విప‌క్ష పార్టీల నేత‌ల‌కు లేఖ రాశారు. ప్ర‌స్తుతం దేశానికి ఒక మంచి రాష్ట్రప‌తి అవ‌స‌రం ఉంద‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. రాజ్యాంగాన్ని, దేశ పౌరుల‌ను అధికార పార్టీ నుంచి ర‌క్షించే నాయ‌కుడు కావాల‌ని ఆమె పేర్కొన్నారు. ఈ లేఖ పంపిన వారిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో పాటు ప‌లు విప‌క్ష నాయ‌కులు ఉన్నారు. 

నాగాలాండ్‌ కాల్పుల కేసు.. 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసిన పోలీసులు

తాను కోవిడ్ తో బాధ‌ప‌డుతున్నందున ఇతర నాయకులతో సమన్వయం కోసం ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపి) మల్లికార్జున ఖర్గేను నియమించాన‌ని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య సంస్థలను, పౌరులను అధికార పార్టీ దాడుల నుంచి రక్షించగల అధ్య‌క్షుడు దేశానికి అవసరమని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కాగా రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థికి నిర్దిష్ట పేరును సూచించలేదని పార్టీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత విచ్ఛిన్నమైన సామాజిక వస్త్రాన్ని న‌యం చేసే స్పర్శ'ను వర్తింపజేయగల అధ్యక్షుడిని ఎన్నుకోవడం అవ‌స‌రం తెలిపారు. ‘‘ చర్చలు ఓపెన్ మైండెడ్ గా, ఈ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఇతర రాజకీయ పార్టీలతో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ చర్చను ముందుకు తీసుకెళ్లాలని మేము నమ్ముతున్నాము ’’ అని ఆమె పేర్కొన్నారు. 

Prophet row : నూపుర్ శర్మకు ముంబై పోలీసుల స‌మ‌న్లు.. ఈ నెల 25న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశం

ఇదిలా ఉండ‌గా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వచ్చే రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జూన్ 15 న న్యూఢిల్లీలో తాను నిర్వ‌హించే సమావేశానికి హాజరు కావాలని అభ్యర్థిస్తూ ప్రతిపక్ష నాయకులకు శనివారం లేఖ రాశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా 22 మంది ప్రతిపక్ష నేతలకు బెనర్జీ లేఖ పంపారు. దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు పీడిస్తున్నప్పుడు జాతీయ రాజకీయాల భవిష్యత్తు గమనంపై చర్చించేందుకు అన్ని ప్రగతిశీల ప్రతిపక్షాలకు రాష్ట్రపతి ఎన్నికలు సరైన అవకాశాన్ని కల్పిస్తున్నాయని ఆమె అన్నారు.

‘‘ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం ప్రతిష్ట మసకబారింది, ఇలాంటి ప‌రిస్థితిలో మొత్తం ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలి. ఎందుకంటే ఇలా చేయ‌డం వ‌ల్లే మరోసారి భార‌త గణతంత్రంను ర‌క్షించిన‌వార‌వుతాం. ’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా భారత రాష్ట్రపతికి ఎన్నిక జూలై 18న జరుగుతుందని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులు ప్రస్తుత రామ్‌నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకోనున్నారు. 

Saharanpur violence: సహరన్‌పూర్ హింస ఘ‌ట‌న.. నిందితుల అక్రమ ఆస్తుల కూల్చివేత‌.. 64 మంది అరెస్టు..

రాష్ట్రపతి ఎన్నికలు పరోక్షంగా పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా నిర్వ‌హిస్తారు. దాదాపు 10.86 లక్షల ఓట్లతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో, బీజేపీ నేతృత్వంలోని కూటమికి 48 శాతానికి పైగా ఓట్లు వస్తాయని అంచనా. పొత్తులో లేని ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది.