Asianet News TeluguAsianet News Telugu

పరీక్ష రాస్తుంటే పురుటి నొప్పులు.. పుట్టిన శిశువుకు ‘టెట్’ అని పేరు..

పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భిణి. ఆదివారం టెట్ కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. exam రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్పమతత్తమైన ఇన్విజిలేటర్ వెంటనే అంబులెన్స్ ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. టెట్ పరీక్షకు గుర్తుగా.. వైద్య సిబ్బంది ఆ పిల్లవాడికి టెట్ అని నామకరణం చేశారు. 

pregnant woman get pain during exam hall, Named the newborn baby Tet in uttar pradesh
Author
Hyderabad, First Published Jan 25, 2022, 11:49 AM IST

ఉత్తర్ ప్రదేశ్ : Uttar Pradesh లో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) రాస్తుండగా ఓ pregnant ladyకి పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్ లో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ పండంటి baby boyకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సిబ్బంది పసివాడికి ‘Tet’ అని పేరు పెట్టారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో అమ్రోహా జిల్లాలో జరిగింది. నాన్ పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి.. ప్రబుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలా రోజుల క్రితం టెట్ కు దరఖాస్తు చేసింది.

పరీక్ష సమయానికి ఆమె నిండు గర్భిణి. ఆదివారం టెట్ కు హాజరయ్యేందుకు గజ్రైలాలోని డిగ్రీ కళాశాలకు భర్త సాయంతో వెళ్లింది. exam రాస్తుండగా సాయంత్రం 4 గంటల సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అప్పమతత్తమైన ఇన్విజిలేటర్ వెంటనే అంబులెన్స్ ను పిలిపించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ రేణు దేవి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. టెట్ పరీక్షకు గుర్తుగా.. వైద్య సిబ్బంది ఆ పిల్లవాడికి టెట్ అని నామకరణం చేశారు. 

ఇదిలా ఉండగా, 2021, జూన్ లో టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్‌ సర్టిఫికేట్‌కు ఏడేళ్ల కాలపరిమితిని ఎత్తివేస్తూ.. అది జీవిత కాలం చెల్లుబాటు అయ్యేలా సవరణలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌  పోఖ్రియాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేవారికి టెట్‌ను తప్పనిసరి చేస్తూ గతంలో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఆదేశాల ప్రకారం.. ఆయా రాష్ట్రాలు టెట్‌ను నిర్వహిస్తున్నాయి. ఒకసారి టెట్‌లో పాసైతే దాని వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుంది. ఈ లోపల ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధిస్తే సరేసరి, ఏడేళ్లు ముగిసిన తర్వాత ఖచ్చితంగా మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 

అయితే దీనిపై నిపుణులు, మేధావులు, విద్యార్ధుల నుంచి విజ్ఞప్తులు రావడంతో కేంద్రం స్పందించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం జీవితంలో ఒకసారి టెట్‌ పాసైతే, ఉద్యోగం సంపాదించే వరకు దానిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం భావిస్తోంది. అభ్యర్ధుల ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పోఖ్రియాల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే టెట్‌ అర్హత సాధించి ఏడేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కొత్త ధ్రువపత్రాలు జారీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. 2011 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇది వర్తించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios