Asianet News TeluguAsianet News Telugu

గర్భిణీ అనే కనికరం లేకుండా.. మహిళా ఫారెస్ట్ గార్డ్ పై దాడి..!

 సదరు ఫారెస్ట్ అధికారిణి  మూడు నెలల గర్భిణీ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో.. సదరు మాజీ సర్పించి పై విమర్శల వర్షం కురుస్తోంది.
 

Pregnant Forest Staff Pulled By Hair, Kicked In Maharashtra Shocker
Author
Hyderabad, First Published Jan 20, 2022, 4:09 PM IST

 మహారాష్ట్ర సతారా జిల్లాలో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న అటవీ శాఖ అధికారిపై గ్రామ మాజీ సర్పంచ్,​ అతని భార్య కలిసి దాడి చేశారు. జిల్లాలోని పల్సవాడే గ్రామంలో ఈ ఘటన జరిగింది.నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో గ్రామ సర్పంచ్​గా కూడా పనిచేశాడు. అయితే.. తన అనుమతి లేకుండా ఒప్పంద ఉద్యోగులను వెంట తీసుకెళ్లారనే కోపంతో అటవీ శాఖ మహిళా గార్డ్​పై కోపోద్రిక్తుడయ్యాడు. ఆమె గర్భంతో ఉందని చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశారు.

 

కాగా.. సదరు ఫారెస్ట్ అధికారిణి  మూడు నెలల గర్భిణీ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో.. సదరు మాజీ సర్పించి పై విమర్శల వర్షం కురుస్తోంది.

దీనిపై స్పందించిన మహారాష్ట్ర వాతావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే.. నిందితులకు కఠిన శిక్ష తప్పదని ట్వీట్ చేశారు. ఉద్యోగులపై దాడులు సహించబోమని స్పష్టం చేశారు. బాధితురాలు గర్భానికి ప్రమాదం జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఫారెస్ట్ గార్డ్​ అయిన తన భర్తపై కూడా దాడి చేశారని ఆ మహిళా ఉద్యోగి ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios